తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందరి కళ్లూ చారులతా బామ్మ వైపే... - virat met 87 year old lady

క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేటప్పుడు కెమెరాలు, ప్రేక్షకుల కళ్లు ఆటగాళ్లపైనే ఉంటాయి. ఆ మ్యాచ్‌కు ఎవరైనా సెలబ్రిటీలు వస్తే మాత్రం.. అటు కూడా ఆకర్షణ ఉంటుంది. కానీ.. మంగళవారం భారత్​Xబంగ్లాదేశ్​ మ్యాచ్​లో ఓ మహిళా అభిమానిపై అందరి కళ్లూ నిలిచాయి.

అందరి కళ్లూ చారులతా బామ్మ వైపే...

By

Published : Jul 3, 2019, 5:55 AM IST

క్రికెట్‌ మైదానాల్లో ప్రేక్షకుల దృష్టంతా ఆటగాళ్లపైనే ఉంటుంది. కెమెరాలైతే.. క్రికెటర్ల భార్యలు, పిల్లలు మద్దతివ్వడాన్ని చూపిస్తుంటాయి. కొన్నిసార్లు సినిమా, వ్యాపార రంగ ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్లవైపు తిరుగుతుంటాయి. కానీ... ప్రపంచకప్‌లో మంగళవారం భారత్‌Xబంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని హైలైట్‌ చేశాయి. ఆమె సెలబ్రిటీ కాదు 87 ఏళ్ల వృద్ధురాలు. పేరు చారులతా పటేల్​. తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు.

టీమిండియా బ్యాటింగ్‌ చేస్తుండగా ఆటగాళ్లకు మద్దతిచ్చారు. ముఖ్యంగా రాహుల్‌-రోహిత్‌లు బౌండరీలు బాదుతుంటే ఈమె బూర ఊదుతూ తెగ సందడి చేశారు. భారత్​ కచ్చితంగా విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పారు.

బామ్మను కలిసిన కోహ్లీ, రోహిత్​

మ్యాచ్​ అనంతరం భారత జట్టు సారథి కోహ్లీ, వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ ఆమెను కలిశారు. వీరిద్దరూ బామ్మతో దిగిన ఫొటోలు నెట్టింట షేర్​ చేశాడు.

" ప్రేమ, మద్దతు చూపిస్తోన్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చారులతా పటేల్​ గారికి. 87 ఏళ్ల వయసైనా ఇప్పటివరకు నేను చూసిన అందరిలో అమితాసక్తి కలిగిన అభిమాని ఆమె. వయస్సు ఒక సంఖ్య మాత్రమే.. కానీ ఆటమీద ఉన్న ఇష్టం హద్దులు లేనిది. జట్టు మొత్తానికి ఆమె ఆశీర్వాదాలు లభించాయి. నిజంగా బామ్మ మాటలు ప్రేరణ కలిగించాయి. తర్వాతి మ్యాచ్​ కోసం ఆమె దీవెనలు తీసుకున్నాం".
-- కోహ్లీ, భారత క్రికెట్​ జట్టు కెప్టెన్​.

ప్రస్తుతం ఈ బామ్మ ఫొటో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వయసులోనూ క్రికెట్‌ మ్యాచ్‌లకు వచ్చి బామ్మ సందడి చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details