ఇంగ్లీష్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐర్లాండ్‌తో టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రాణించి టెస్టు బౌలర్ల జాబితాలో తొలి స్థానానికి పోటీ ఇవ్వాలనుకున్న అతడికి నిరాశే ఎదురైంది. బుధవారం లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది ఇంగ్లాండ్.
ప్రస్తుతం 862 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న అండర్సన్... ఈ మ్యాచ్‌లో రాణిస్తే పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)తో పోటీ పడేవాడు. ప్రస్తుతం కమిన్స్ 878 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య 16 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. గతేడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ రబాడను వెనక్కి నెట్టి రెండో స్థానం కైవసం చేసుకున్నాడు అండర్సన్.
ఇంగ్లాండ్ జట్టు...