నేడు కొంత మంది భారతీయ సినీ ప్రముఖులు మాంచెస్టర్‌లో జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.
వరల్డ్ కప్‌పై సినిమా.. వరల్డ్ కప్‌లో హీరో
ఓపెనర్ శిఖర్‌ధావన్‌తో రణ్వీర్ సందడి బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్.. గాయంతో ఆటకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి భారత్-పాక్ మ్యాచ్‌లో సందడి చేశాడు. రణ్వీర్ ప్రస్తుతం భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో '83' అనే సినిమాలో నటిస్తున్నాడు.
మొదటిసారి వరల్డ్ కప్ సాధించినప్పటి పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రణ్ వీర్ ప్రపంచకప్‌పై తీస్తున్న సినిమాలో నటిస్తూ... ప్రపంచకప్ మ్యాచ్‌కు హాజరై సందడి చేశాడు.
మ్యాచ్‌లో రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సందడి
భారత్-పాక్ మ్యాచ్‌కు రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ భారత్-పాక్ మ్యాచ్‌కు హాజరైంది. టీమిండియాను ప్రోత్సహిస్తూ మైదానంలో సందడి చేసింది.
జాతీయ జెండా ప్రదర్శిస్తున్నమంచు లక్ష్మి తెలుగు సినీ నటి, మోహన్ బాబు తనయ మంచు లక్ష్మి దాయాదులతో పోరు చూసేందుకు మాంచెస్టర్‌కు వచ్చారు. భారత్‌కు మద్దతుగా జాతీయ జెండా ప్రదర్శిస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఇండియా జెర్సీతో శివ కార్తికేయన్... అనిరుధ్
ఇండియా జెర్సీతో శివకార్తికేయన్... అనిరుధ్ రవిచంద్రన్ తమిళ యువ కథనాయకుడు శివ కార్తికేయన్.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ మాంచెస్టర్ మైదానంలో భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇద్దరూ భారత జెర్సీలు ధరించి మద్దతు ప్రకటించారు.