తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: గాయంతోనే కేరీ కీలక ఇన్నింగ్స్ - ripper from Archer and that would have sent shockwaves across Australia

ప్రపంచకప్‌లో భాగంగా బర్మింగ్​హమ్​ వేదికగా జరుగుతున్న సెమీఫైనల్​-2లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ జట్లు తలపడుతున్నాయి. మొదటి బ్యాటింగ్​ ప్రారంభించిన ఆసీస్​ 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో వచ్చిన కేరీ.. ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​ వేసిన బంతికి గాయపడినా ఆటను కొనసాగించాడు.

గాయంతోనే క్యారీ బ్యాటింగ్​... 46 పరుగులతో రాణింపు

By

Published : Jul 11, 2019, 6:08 PM IST

ఆస్ట్రేలియాXఇంగ్లాండ్ మధ్య బర్మింగ్​హమ్​ వేదికగా జరుగుతున్నరెండో సెమీఫైనల్​​లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్​ పేస్​ బౌలింగ్​ను ఎదుర్కొనే సమయంలో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్​. ఈ దశలో ఐదవ స్థానంలో క్రీజులోకి వచ్చిన అలెక్స్ కేరీ... ఇంగ్లీష్​ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి గాయపడ్డాడు. ఆర్చర్​ వేసి బంతి అలెక్స్ కేరీ హెల్మెట్​ను పడగొట్టి దవడ భాగం వద్ద బలంగా తాకింది. ఫలితంగా బాగా రక్తం రాగా... అంపైర్లు మ్యాచ్​ను కొద్దిసేపు నిలిపివేశారు.

ఓ వైపు కష్టాల్లో ఉన్న జట్టును చూసిన కేరీ... ప్రథమ చికిత్స చేయించుకొని బ్యాటింగ్​కు దిగాడు. అందరూ రిటైర్ట్‌ హర్ట్‌ అవుతాడని అనుకున్నా రక్తం కారుతున్న చోట ప్లాస్టర్‌ వేసుకుని మైదానంలో ఆటను కొనసాగించాడు. ఓ పక్క గాయం ఇబ్బంది పెడుతున్నా 46 పరుగుల(70 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్​ ఆడి ఔటయ్యాడు.

నాలుగు పరుగులకే కెప్టెన్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డక్‌ ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత మరో ఆరు పరుగులకే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(9)ను క్రిస్‌వోక్స్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్​లో చోటు దక్కించుకున్న హ్యాండ్స్​కాంబ్​ (4) పరుగులే చేసి నిరాశపరిచాడు.

ABOUT THE AUTHOR

...view details