ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మెన్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది కాలంగా ఫార్మాట్ ఏదైన తన బ్యాటింగ్‌తో సత్తాచాటుతున్నాడని తెలిపాడు.
'ఇంగ్లాండ్‌లో బట్లర్ చాలా ప్రమాదకారి' - buttler
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. బట్లర్ 360 డిగ్రీల ఆటగాడని, గతంతో పోల్చితే ఇంగ్లీష్ ఆటగాడి బ్యాటింగ్‌లో చాలా మార్పొచ్చిందని తెలిపాడు.
"ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జాస్ బట్లర్ ప్రమాదకర బ్యాట్స్‌మెన్. గతంలో ముంబయి ఇండియన్స్ తరపున అతడికి కోచింగ్ ఇచ్చే అవకాశమొచ్చింది. అప్పటికీ ఇప్పటికీ బట్లర్ బ్యాటింగ్‌లో ఎంతో మార్పు వచ్చింది. జాస్ బట్లర్ 360 డిగ్రీల ఆటగాడు. మైదానంలో ఎటైన షాట్ కొట్టగలడు. బట్లర్ తర్వాత.. ఇయాన్ మోర్గాన్, బెయిర్ స్టోలు మ్యాచ్ మలుపు తిప్పేయగల ప్లేయర్లు". -రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉందని.. బట్లర్, మొయిన్ అలీ, స్టోక్స్‌లో ఒకరు 7, 8, 9 స్థానాల్లో ఆడితే ఇంగ్లీషు జట్టు ఇంకా పటిష్ఠంగా తయారౌతుందని పాంటింగ్ చెప్పాడు. స్వదేశంలో జరిగే టోర్నీలో స్వేచ్ఛగా ఆడేందుకు వారికి అవకాశముందన్నాడు.