తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా' - ప్రపంచంలో అత్యత్తమ బౌలర్​ బుమ్రా

టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్​లలో రాణిస్తున్న జస్ప్రిత్​ బుమ్రా.. ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్​ అంటూ​ కితాబిచ్చాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇటీవలే వెస్టిండీస్​తో రెండో టెస్టులో హ్యాట్రిక్ నమోదు చేశాడీ బౌలర్.

కోహ్లీ, బుమ్రా

By

Published : Sep 3, 2019, 3:30 PM IST

Updated : Sep 29, 2019, 7:21 AM IST

వెస్టిండీస్​తో జరిగిన టెస్టు సిరీస్​ను కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ఈ జట్టుపై రెండో టెస్టులో 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన భారత్​ పేసర్​ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ విరాట్​ కోహ్లీ.

"టీ20 బౌలర్​ అనే పేరును చెరిపేస్తూ ప్రపంచ స్థాయిలో అన్ని ఫార్మాట్​లలో రాణించే స్థాయికి చేరాడు బుమ్రా. తానేంటో నిరూపించుకుని పూర్తిస్థాయి ఆటగాడిగా మారాడు. పేస్​, స్వింగ్​లతో అన్ని విధాలుగా బ్యాట్స్​మెన్​ను కట్టడి చేస్తున్నాడు. అంతర్జాతీయ వేదికపై పరిపూర్ణమైన బౌలర్​ బుమ్రా. ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ పేసర్​ అనడంలో సందేహం లేదు. ఆటలో ఎంతో శ్రద్ధ చూపిస్తూ తనని తాను మలుచుకున్నాడు. బుమ్రా మా జట్టులో ఉండటం అదృష్టం". -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

తొలి టెస్టులో విండీస్‌పై చెలరేగిన బుమ్రా.. రెండో మ్యాచ్​లోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. టాప్ 5 బ్యాట్స్​మెన్​లతో కలిపి 6 వికెట్లు తీశాడు. ఇదే మ్యాచ్​లో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు సాధించాడు.

ఇదీ చూడండి: టీ20లకు ప్రముఖ క్రికెటర్ మిథాలీ వీడ్కోలు

Last Updated : Sep 29, 2019, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details