తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: బుమ్రా ఖాతాలో 'శతక' వికెట్లు

భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్​ప్రీత్​ బుమ్రా.. వన్డేల్లో 100 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. ప్రపంచకప్‌లో భాగంగా  శ్రీలంకతో జరిగిన చివరి లీగ్​ మ్యాచ్‌లో ఈ సరికొత్త రికార్డు సాధించాడు. అతి తక్కువ వన్డేల్లో ఈ మైలురాయి చేరుకున్న రెండో భారతీయ బౌలర్​గానూ నిలిచాడు బుమ్రా.

WC19: బుమ్రా ఖాతాలో 'శతక' వికెట్లు

By

Published : Jul 7, 2019, 7:35 AM IST

ప్రపంచకప్​ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన పోరులో ఆ జట్టు సారథి కరుణరత్నె(10) వికెట్ తీసిన ఈ స్పీడ్​స్టర్​... కెరీర్​లో వందో వికెట్​ సాధించాడు. అతి తక్కువ వన్డేల్లో(57) ఈ రికార్డు సృష్టించిన రెండో భారత బౌలర్​ బుమ్రా. జస్​ప్రీత్​ కంటే ముందు మహ్మద్‌ షమి 56 వన్డేల్లోనే శతక వికెట్ల మార్కు అందుకున్నాడు. తర్వాత స్థానాల్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ (59), జహీర్‌ ఖాన్‌ (65), అజిత్‌ అగార్కర్‌(67), జవగళ్‌ శ్రీనాథ్‌ (68) ఉన్నారు.

ప్రపంచక్రికెట్​లో చూస్తే తక్కువ వన్డేల్లో వంద వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అఫ్గాన్‌ స్పిన్నర్​ రషీద్‌ ఖాన్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. 44 వన్డేల్లోనే ఈ రికార్డు సాధించాడీ సంచలన బౌలర్​​. ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌(52 వన్డేల్లో), సక్లయిన్‌ ముస్తాక్‌ (పాకిస్థాన్‌-53) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

వన్డే వరల్డ్​కప్​లోని ఆఖరి లీగ్​ మ్యాచ్​లో లంకేయులపై 7 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్​లో 3 వికెట్లు తీసిన బుమ్రా... ప్రస్తుతం 102 వికెట్లతో కొనసాగుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details