ప్రపంచకప్ సమరం తుది అంకానికి చేరుకుంది. పది జట్లతో ఆరంభమైన ఈ పోరులో నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మంగళవారం జరిగే తొలి సెమీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో భారత్‌కు కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి సమస్య ఎదురుకానుంది.
ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా మిడిల్ ఆర్డర్ పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటీకి టాపార్డర్ రాణించింది. రోహిత్ శర్మ, రాహుల్, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో సెమీస్ వరకు చేరింది భారత్. అయితే సెమీస్‌లో బౌల్ట్ సమస్యగా మారనున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మెగాటోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన కివీస్ పేసర్ 15 వికెట్లు తీశాడు.
ఓపెనర్లను త్వరగా పెవిలియన్ చేర్చడంలో బౌల్ట్ దిట్ట. అందులోనూ భారత్‌పై మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది భారత్‌తో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3.92 సగటుతో 12 వికెట్లు తీశాడు. ఈ మెగాటోర్నీలో 5 శతకాలతో ఆకట్టుకున్న రోహిత్ తన కెరీర్లో బౌల్ట్ బౌలింగ్‌లోనే నాలుగు సార్లు ఔటయ్యాడు. భారత్ ఆడిన వార్మప్ మ్యాచ్‌లోనూ బౌల్ట్ 4 వికెట్లు తీశాడు. ఫలితంగా టీమిండియా 179పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్, శిఖర్ ధావన్, కే ఎల్ రాహుల్ వికెట్లు పడగొట్టాడు బౌల్ట్.