తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ X కివీస్​: తొలి సెమీస్​లో ఢీ అంటే ఢీ

మాంచెస్టర్​లో ప్రపంచకప్​ తొలి సెమీఫైనల్​కు అంతా సిద్ధమైంది. గెలిచేందుకు కోహ్లీ, విలియమ్సన్.. అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్​కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.

సెమీ'సమరం'లో తొలి మ్యాచ్​కు అంతా సిద్ధం

By

Published : Jul 9, 2019, 5:19 AM IST

ప్రపంచకప్​ గెలిచేందుకు భారత్​కు మరో రెండు అడుగుల దూరం మాత్రమే ఉంది. నేడు సెమీస్​లో కివీస్​తో సమరానికి సిద్ధమైంది. మాంచెస్టర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

కప్పు కొట్టడమే లక్ష్యంగా ఈ మెగాటోర్నీలో అడుగుపెట్టింది కోహ్లీసేన. అందుకు తగ్గట్టుగానే ప్రదర్శన చేస్తూ వచ్చింది. 9 మ్యాచ్​ల్లో 7 మ్యాచ్​ల్లో గెలిచి, ఇంగ్లాండ్​పై మాత్రమే ఓడింది. న్యూజిలాండ్​తో ఆడాల్సిన లీగ్ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు ఎలాగైనా ఆ జట్టును ఓడించాలని భారత్ తపిస్తోంది.

టీమిండియా కెప్టెన్ కోహ్లీ

వరుస విజయాలు నమోదు చేసి టీమిండియా ఉత్సాహంతో ఉండగా, గత 3 మ్యాచ్​ల్లోనూ ఓటమిపాలైంది కివీస్. ఈ రోజు గెలిచి ఫైనల్​లో అడుగుపెట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. కానీ ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

టీమిండియా

భారత్​ ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ (647)- రాహుల్ (360) అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే రోహిత్ అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాడు. కెప్టెన్​గానే కాకుండా బ్యాటింగ్​లోనూ ఆకట్టుకుంటున్న కోహ్లీ.. ఈ ప్రపంచకప్​లో 442 పరుగులు చేశాడు. వీరు ముగ్గురూ మరోసారి చెలరేగితో టీమిండియా గెలుపు నల్లేరుపై నడకే.

రోహిత్ శర్మ-రాహుల్ జోడి

భారత్​ను వేధిస్తోన్న సమస్య మిడిలార్డర్. టాప్ ఆర్డర్​ విఫలమైతే సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోతున్నారు. పాండ్య అనుకున్నంతగా ఆడలేకపోతున్నాడు. ధోని నెమ్మదిగా ఆడుతున్నాడు. మరి ఈ మ్యాచ్​లో వాటికి భారత్​ చెక్ పెడుతుందేమో​ చూడాలి.

బౌలింగ్​ విభాగానికొస్తే బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి తోడుగా షమి, భువనేశ్వర్ రాణిస్తే టీమిండియా ఫైనల్​లో అడుగుపెట్టడం చాలా తేలిక. ఈ మ్యాచ్​లో వీరికి తోడుగా స్పిన్నర్లలో కుల్​దీప్, చాహల్​లో ఒకరికి అవకాశం దక్కొచ్చు.

న్యూజిలాండ్

బ్యాటింగ్​లో కెప్టెన్ విలియమ్సన్ (481) మినహా మరెవరూ పరుగులు చేయలేకపోతున్నారు. మిగతావారిలో రాస్​ టేలర్ మాత్రమే ఇప్పటివరకు 261 పరుగులు చేసి కొంతలో కొంత మెరుగ్గా ఉన్నాడు.

కివీస్ కెప్టెన్ విలయమ్సన్

కివీస్​ జట్టుకు బౌలింగ్​ అతి పెద్ద​ బలం. బౌల్ట్, ఫెర్గుసన్, హెన్రీ పేస్​తో ప్రత్యర్థుల్ని పరుగులు చేయకుండా కట్టడి చేసి వికెట్లు తీస్తున్నారు. వీరిని మన బ్యాట్స్​మెన్ ఎంత వరకూ అడ్డుకుంటారనేది ప్రశ్న.

కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్

ప్రపంచకప్​లో ఈ స్టేడియంలో జరిగిన 4 మ్యాచ్​ల్లోనూ మొదట బ్యాటింగ్​ చేసిన జట్లదే విజయం. అందులో రెండు టీమిండియా మ్యాచ్​లే కావడం విశేషం. పిచ్ బ్యాటింగ్​కు అనుకూలిస్తుంది. వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలా జరిగినా బుధవారం రిజర్వ్​డేగా ప్రకటించారు కాబట్టి ఇబ్బంది లేదు.

జట్లు (అంచనా)

టీమిండియా:రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), పంత్, ధోని, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్య, కుల్​దీప్, షమి, భువనేశ్వర్, బుమ్రా

న్యూజిలాండ్:గప్తిల్, రాస్ టేలర్, విలియమ్సన్ (కెప్టెన్), గ్రాండ్​హొమ్, సౌథీ, బౌల్ట్, లాథమ్, నీషమ్, హెన్రీ, శాంట్నర్, నికోలస్

ఇది చదవండి: WC19: కివీస్​తో పోరుకు భారత్​ ఇస్మార్ట్ ప్లాన్​

ABOUT THE AUTHOR

...view details