గాయం కారణంగా అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్పింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్... మాంచెస్టర్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పంచుకుంది బీసీసీఐ. 'నెట్స్‌లో ఎవరున్నారో చూడండి' అంటూ షేర్ చేసింది.
మంగళవారం దాదాపు 35 నిముషాల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు భువి. గాయం కారణంగా దూరమైన అతడు ప్రాక్టీస్ సమయంలో పెద్దగా ఇబ్బంది పడలేదని, ఇది మంచి సూచన అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే గురువారం జరగబోయే వెస్టిండీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా..లేదా అనే దానిపై స్పష్టత లేదు.