బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సాధారణ లక్ష్యాన్నే ప్రత్యర్థి ముందు ఉంచింది. 50 ఓవర్లలో ఆలౌట్ అయిన ఆసీస్ 223 పరుగులు చేసింది. స్మిత్(85), కేరీ (46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మ్యాక్స్‌వెల్, స్టార్క్ ఫర్వాలేదనిపించారు.
నిరాశపర్చినఓపెనర్లు
తొలి బంతికే పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు ఆసీస్ సారథి ఫించ్. జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. 3వ ఓవర్ వేసిన వోక్స్ ఆసీస్ వెన్నెముక వార్నర్‌ను ఔట్ చేశాడు. బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు డేవిడ్ వార్నర్. ఈ మ్యాచ్‌లో తుది చోటు దక్కించుకున్న హ్యాండ్స్కాంబ్ 4 పరుగుల స్పల్ప స్కోరుకే ఔటయ్యాడు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆసీస్. తొలి పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 27 రన్స్ మాత్రమే చేసి చెత్త రికార్డు మూటగట్టుకుంది.