తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ సూనాయస విజయం

కాసేపట్లో ఆసీస్​X ఇంగ్లాండ్​ సెమీఫైనల్​-2

By

Published : Jul 11, 2019, 2:38 PM IST

Updated : Jul 11, 2019, 9:45 PM IST

21:41 July 11

ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్​లో అడుగుపెట్టిన ఇంగ్లండ్

ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది.  ఈ విజయంతో ఆదివారం జరిగే ఫైనల్​లో న్యూజిలాండ్​తో తలపడేందుకు సిద్ధమైంది మోర్గాన్​సేన.

224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు లక్ష్యాన్ని కేవలం 32.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ రాయ్ 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. రూట్, కెప్టెన్ మోర్గాన్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. 

అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్​ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్ల తీసి ప్రత్యర్థిని 223 పరుగులకే కట్టడి చేశారు. స్మిత్ ఒక్కడే 85 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. వోక్స్, రషీద్ తలో మూడు వికెట్లు తీశారు. ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

21:32 July 11

విజయానికి మరో 14 పరుగులు 

వేగంగా ఆడుతున్న ఇంగ్లాండ్ లక్ష్యం వైపు చురుగ్గా కదులుతోంది. క్రీజులో ఉన్న రూట్, మోర్గాన్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 30 ఓవర్లలో 210 పరుగులు చేసింది.

21:13 July 11

విజయానికి మరో  48 పరుగులే...

బర్మింగ్​హామ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో నిలకడగా ఆడుతూ లక్ష్యం వైపు సాగుతోంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్లు తీసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో మోర్గాన్, రూట్ ఉన్నారు. 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

20:47 July 11

సెంచరీ చేయకుండానే రాయ్ ఔట్

ఇంగ్లాండ్ ఓపెనర్ రాయ్..  85 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్​లో ఔటయ్యాడు. విజయానికి మరో 77 పరుగులు దూరంలో ఉంది ఇంగ్లాండ్.

20:41 July 11

లక్ష్యం వైపు సునాయసంగా ఇంగ్లాండ్

ఆస్ట్రేలియాతో సెమీఫైనల్​ మ్యాచ్​లో 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ రాయ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో ఓపెనర్ బెయిర్​స్టో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. రాయ్తో పాటు రూట్ క్రీజులో ఉన్నాడు.  ప్రస్తుతం 19 ఓవర్లలో వికెట్ నష్టానికి 141 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు.  

20:02 July 11

రాయ్‌ జోరు..

జేసన్‌ రాయ్‌(39) దూకుడు పెంచాడు. లైయన్‌ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌, బౌండరీ బాదాడు. ఫలితంగా 11వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.

11 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు- 63/0

19:53 July 11

9 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు- 44/0.

తొమ్మిదో ఓవర్‌ వేసిన కమిన్స్‌ పరుగులు కట్టడి చేశాడు. తొలి ఐదు బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కానీ ఆఖరి బంతిని రాయ్‌(23) బౌండరీకి తరలించి మెయిడిన్‌ ఓవర్‌ కాకుండా చేశాడు.

19:44 July 11

7 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 33/0

కమిన్స్‌ తన తొలి ఓవర్‌లోనే పరుగులు రాకుండా బాగా కట్టడి చేశాడు. అతని బౌలింగ్‌లో బెయిర్‌స్టో(12) తొలి ఐదు బంతుల్ని వృథా చేసి.. ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రాయ్‌(19) నిలకడగా ఆడుతున్నాడు.

19:32 July 11

5 ఓవర్లకు ఇంగ్లాండ్‌- 19/0

జేసన్​ రాయ్(13), బెయిర్​ స్టో(5) పరుగులతో నెమ్మదిగా ఆడుతున్నారు. తక్కువ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వికెట్లు కాపాడుకొంటున్నారు. ఆసీస్​ పేసర్లు ఇబ్బంది పడుతున్నా అప్పుడప్పుడూ ఫోర్లతో అలరిస్తున్నారు.

19:27 July 11

4 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు- 16/0

4వ ఓవర్​ వేసిన స్టార్క్​ 10 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఓవర్​లో రెండు ఫోర్లు బాదాడు జేసన్​ రాయ్​. 

19:23 July 11

మెయిడిన్​ ఓవర్​...

3వ ఓవర్​ వేసి బెహ్రెండార్ప్​ మెయిడిన్​ చేశాడు. ఆరు బంతుల్ని వృథా చేశాడు బెయిర్​ స్టో. పదునైన పేస్​ లైనప్​తో పరుగులను కట్టడి చేస్తోంది ఆసీస్​.

3 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు- 6/0

19:21 July 11

స్టార్క్​ పదునైన బౌలింగ్​..

తన తొలి ఓవర్‌లోనే పరుగులు కట్టడి చేశాడు స్టార్క్‌. కేవలం ఒక్క పరుగే ఇచ్చి ఆకట్టుకున్నాడు. రాయ్‌(1) ఎదుర్కొన్న ఆరు బంతుల్ని వృథా చేశాడు.

2 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు- 6/0

19:13 July 11

ఇంగ్లాండ్​ లక్ష్య ఛేదన..

ఆస్ట్రేలియా నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యానని ఛేదించేందుకు ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ ఆరంభించింది. ఓపెనర్లుగా బెయిర్​స్టో, జేసన్​ రాయ్​ క్రీజులోకి వచ్చారు.

19:11 July 11

స్మిత్​ ఒంటరి పోరాటం..

బర్మింగహామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో సెమీఫైనల్​ మ్యాచ్​లో ఆసీస్​ నామమాత్రపు స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఫించ్​ సేన నిర్ణీత 50 ఓవర్లలో 223 స్కోరు చేసి ఆలౌటైంది. 85 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు స్మిత్​. ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్లలో కేరీ(46), మ్యాక్స్​వెల్​(22), స్టార్క్​(29) చేశారు. ఫలితంగా ప్రత్యర్థి ఇంగ్లాండ్​కు 224 పరుగుల లక్ష్యం నిర్దేశించింది ఫించ్​ సేన.

జోఫ్రా ఆర్చర్​, రషీద్​ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. ఆర్చర్​ 2, వుడ్​ 1 వికెట్​ తమ ఖాతాలో వేసుకున్నారు.

18:38 July 11

వరుస బంతుల్లో వికెట్లు...

85 పరుగులతో కీలక ఇన్నింగ్స్​ ఆడిన స్మిత్​ను పెవిలియన్​ చేర్చాడు వోక్స్​. 47వ ఓవర్​ తొలి బంతికి స్మిత్​ రనౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత బంతికే బట్లర్​ క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు స్టార్క్​(29). ఫలితంగా వోక్స్​ భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు.

48 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు - 218/9

18:31 July 11

45 ఓవర్లకు ఆసీస్‌ స్కోరు - 206/7

నిదానంగా సాగుతున్న ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కాస్త ఊపు తెస్తున్నాడు స్టార్క్‌(22). ప్లంకెట్‌ బౌలింగ్‌లో ఈ ఓవర్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతిని స్మిత్‌(82) బౌండరీకి తరలించాడు. ఫలితంగా 14 పరుగులు వచ్చాయి.

18:21 July 11

42 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 181/7

మార్క్‌ వుడ్‌ ఈ ఓవర్‌లో 5 పరుగులు ఇచ్చాడు. స్కోరుబోర్డు నిదానంగా సాగుతోంది. స్టార్క్‌(7), స్మిత్‌(74) పోరాడుతున్నారు. 

18:04 July 11

40 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 175/7

ఆర్చర్‌ కోటా కూడా పూర్తైంది. ఆఖరి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చాడు. 40వ ఓవర్​ వేసి ఉడ్​ 4 రన్స్​ మాత్రమే ఇచ్చి ఆసీస్​ను నిలువరించాడు. స్మిత్‌(73), స్టార్క్‌(4) పోరాడుతున్నారు. 

17:55 July 11

రషీద్​ ఖాతాలో మూడోది...

6 పరుగులతో ఉన్న కమిన్స్​ను పెవిలియన్​ చేర్చాడు రషీద్​. 37వ ఓవర్​ మూడో బంతికి డిఫెన్స్​ ఆడబోయి రూట్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​ చేరాడు. స్మిత్(68)​ ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

38 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 166/7

17:46 July 11

జోఫ్రా ఖాతాలో మరొకటి​...

జోఫ్రా ఆర్చర్​ వేసిన 34వ ఓవర్​ 5వ బంతికి పెవిలియన్​ చేరాడు మ్యాక్స్​వెల్​. డిఫెన్స్​ ఆడే ప్రయత్నంలో మోర్గాన్​కు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు మ్యాక్స్​వెల్(22)​. ఫలితంగా 157 పరుగుల వద్ద ఆరో వికెట్​ కోల్పోయింది ఆస్ట్రేలియా. మరో ఎండ్​లో ఉన్న స్మిత్​ (65) పరుగులతో క్రీజులో ఉన్నాడు. కమిన్స్​ 7వ స్థానంలో బరిలోకి దిగాడు.

35 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 157/6

17:37 July 11

34 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 152/5

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​ను స్మిత్​, మ్యాక్స్​వెల్​ కలిసి నెమ్మదిగా నడిపిస్తున్నారు. స్మిత్​(63), మ్యాక్స్​వెల్​(21) క్రీజులో ఉన్నారు.

17:30 July 11

31 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 135/5

118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. మరోవైపు స్మిత్​ అద్భుతమైన బ్యాటింగ్​ చేస్తున్నాడు. కీలక సమయంలో వికెట్లు కాపాడుకుంటూ 60 పరుగులు(78 బంతుల్లో) చేశాడు. మరో ఎండ్​లో మ్యాక్స్​వెల్(7)​ దూకుడు లేకుండా ఆడుతున్నాడు.

17:19 July 11

20 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 78/3

మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకుంటున్నారు ఆసీస్​ బ్యాట్స్​మెన్లు. స్మిత్​(34), క్యారీ(25) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్​ పేస్​ బౌలింగ్​ను ఎదుర్కొంటూ 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

16:33 July 11

18 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 66/3

14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును.. నెమ్మదిగా నడిపిస్తున్నారు ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్లు. స్మిత్​(28), క్యారీ (19) క్రీజులో కొనసాగుతున్నారు.

16:27 July 11

బాల్​ తగిలి గాయపడిన క్యారీ...

3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్​ను పదునైన బంతులతో భయపెడుతున్నారు ఇంగ్లాండ్​ బౌలర్లు. జోఫ్రా ఆర్చర్​ వేసిన 7వ ఓవర్​ చివరి బంతికి గాయపడ్డాడు క్యారీ. దవడ కింద భాగం రక్తం రావడం వల్ల కాసేపు మ్యాచ్​కు అంతరాయం ఏర్పడింది. క్యారీకి మైదానంలో ప్రథమ చికిత్స చేస్తున్నారు.

15:34 July 11

6 ఓవర్లకు ఆసీస్​ స్కోరు- 14/3

6వ ఓవర్​ తొలి బంతికే మూడో వికెట్​ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్​ బౌలర్​ వోక్స్​ పదునైన బంతులతో హ్యాండ్స్​కాంబ్​ను పెవిలియన్​ చేర్చాడు. క్రీజులో క్యారీ, స్మిత్​ ఉన్నారు.

15:24 July 11

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో సెమీఫైనల్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా తడబడుతోంది. 3 ఓవర్లలోపే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లిద్దరూ పెవిలియన్​ చేర్చి.. ఆసీస్​ను దెబ్బతీశారు ఆతిథ్య జట్టు బౌలర్లు. 3 ఓవర్లకు కంగారూల స్కోరు 11/2.

15:13 July 11

WC19: ఓపెనర్లు ఔట్​..3 ఓవర్లకు ఆస్ట్రేలియా 11/2

ప్రపంచకప్​ రెండో సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్​ జట్టుకు అదిరే ఆరంభం లభించింది. 4 పరుగులకే తొలి వికెట్​ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఓపెనర్​ ఫించ్​(0)ను పెవిలియన్​ చేర్చాడు పేసర్​ జోఫ్రా ఆర్చర్​. 

15:05 July 11

WC19: తొలి వికెట్​ కోల్పోయిన ఆసీస్​.. ఫించ్​ డకౌట్​

ప్రపంచకప్​లో నేడు రెండో సెమీస్​ జరుగుతోంది. టాస్​ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్​ ఎంచుకుంది. వార్నర్​, ఫించ్​ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​ను ఆరంభించారు. ఇంగ్లాండ్​ తరఫున వోక్స్​ తొలి ఓవర్​... వేశాడు. తొలి ఓవర్​ ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్​ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. 

15:00 July 11

WC19: ఆసీస్ 4/0... ఇంగ్లాండ్​తో సెమీస్​

బర్మింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న సెమీపైనల్​-2లో టాస్​ గెలిచిన ఆసీస్​... బ్యాటింగ్​ ఎంచుకుంది. 

14:11 July 11

బర్మింగ్​హామ్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న సెమీపైనల్​-2లో టాస్​ గెలిచిన ఆసీస్​... బ్యాటింగ్​ ఎంచుకుంది. 

Last Updated : Jul 11, 2019, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details