ప్రపంచకప్‌లో సెమీస్ బెర్తు సాధించిన ఆసీస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లు గాయాలపాలై టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. ఇటీవల మణికట్టు గాయం కారణంగా షాన్ మార్ష్ ప్రపంచకప్ నుంచి దూరమయ్యాడు. మరో స్టార్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా కుడా ఆదివారం టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఆసీస్ కోచ్ జస్టిస్ లాంగర్ వెల్లడించాడు.
" ఖవాజా తొడకండరాల గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అతడికి మూడు లేదా నాలుగు వారాల విశ్రాంతి సూచించారు వైద్యులు. ఫలితంగా అతడు ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. ఇది నిజంగా చేదు విషయం. అతడు మళ్లీ యాషెస్ టోర్నీలో బరిలోకి దిగే అవకాశముంది ".
-- జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా కోచ్
వేడ్‌తో భర్తీ...
ఇప్పటికే షాన్ మార్ష్ స్థానాన్ని బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌తో భర్తీ చేసింది ఆసీస్. తాజాగా టోర్నీ నుంచి తప్పుకున్న ఖవాజా స్థానంలో ఆస్ట్రేలియా-ఏ జట్టు వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ రానున్నట్లు ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.
దక్షిణాఫ్రికాపై వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఖవాజా తొడకండరాల గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆసీస్ విజయానికి ఆఖరి ఐదు ఓవర్లలో 51 పరుగులు అవసరమైన సందర్భంలో తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. ఆసీస్‌పై దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఫించ్‌సేన్ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం జరిగే సెమీఫైనల్-2లో ఆసీస్...ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది.