తెలంగాణ

telangana

ETV Bharat / sports

శతకంతో రెచ్చిపోయిన డూప్లెసిస్.. ఆసీస్ లక్ష్యం 326 - match

మాంచెస్టర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా 325 పరుగుల భారీ స్కోరు చేసింది. డూప్లెసిస్ శతకంతో ఆకట్టుకోగా.. డసెన్, డికాక్ అర్ధ సెంచరీలు చేశారు. ఆసీస్​ బౌలర్లలో స్టార్క్, లయన్ చెరో రెండు వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా

By

Published : Jul 6, 2019, 10:09 PM IST

ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ పోరులో టాస్ గెలిచిబ్యాటింగ్ ఎంచుకుందిసఫారీ జట్టు. ప్రొటీస్ కెప్టెన్ డూప్లెసిస్​(100)శతకంతో ఆకట్టుకోగా.. డసెన్(95), డికాక్(54) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్​ బౌలర్లలో స్టార్క్​, లయన్ చెరో రెండు వికెట్లు తీయగా.. బెహెండార్ఫ్, కమిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు మార్క్​క్ర​మ్(34) - డికాక్ జోడి 79 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న మార్క్​క్రమ్​​ను ఔట్ చేసి ఈ ద్వయాన్ని విడదీశాడు ఆసీస్ బౌలర్ లయన్. అనంతరం క్రీజులోకి వచ్చిన డూప్లెసిస్ నిలకడగా ఆడాడు. అర్ధశతకం చేసిన డికాక్​ను పెవిలియన్ చేర్చారు లయన్.

ప్రపంచకప్​లో ప్రొటీస్ కెప్టెన్ తొలి శతకం..

డికాక్ ఔటైన తర్వాత డసెన్ సాయంతో రెచ్చిపోయాడు డూప్లెసిస్. ఈ ప్రపంచకప్​లో పెద్దగా ఆకట్టుకోని ప్రొటీస్ కెప్టెన్ ఈ మ్యాచ్​లో విజృంభించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. ఆ ఆరంభాన్ని భారీ స్కోరు దిశగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. 93 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. తర్వాతి బంతికే బెహెండార్ఫ్​ బౌలింగ్​లో ఔట్ అయ్యాడు.

చివర్లో పరుగులు కట్టడి చేసిన ఆసీస్​

డూప్లెసిస్ ఔటైన అనంతరం డసెన్ విజృంభించాడు. 95 పరుగులు చేసి కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు. మొదట నుంచి వేగంగా ఆడిన సఫారీ జట్టు చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఆసీస్​ బౌలర్లు ఆఖరున పరుగులు కట్టడి చేసినందువల్ల ఆశించిన స్కోరు చేయలేకపోయింది ప్రొటీస్ జట్టు. 49వ ఓవర్లో స్టార్క్​ 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 8 పరుగులే వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details