బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 48 పరుగులతేడాతో విజయం సాధించింది. నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లా చివరి వరకు పోరాడి 333 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్(102) శతకంతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మహమ్మదుల్లా(69), తమీమ్ ఇక్బాల్(62) అర్ధశతకాలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కౌల్టర్‌నైల్, స్టాయినిస్ తలో రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. జంపా ఓ వికెట్ తీశాడు. 166 పరుగులతో ఆకట్టుకున్న ఆసీస్ బ్యాట్స్‌మన్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
లక్ష్య ఛేదనలో బంగ్లాకు ఆరంభంలో చుక్కెదురైంది. నాలుగో ఓవర్లోనే సౌమ్యా సర్కార్(10) రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం షకీబ్(41) - తమీమ్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ 79 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే షకీబ్‌ను ఔట్ చేసి స్టాయినిస్ ఈ జోడీని విడదీశాడు. కొద్ది సేపటికే తమీమ్‌ను స్టార్క్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే లిటన్ దాస్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు జంపా.