తెలంగాణ

telangana

ETV Bharat / sports

సెమీస్​లో మరోసారి విమానంతో వివాదస్పద సందేశం

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతుండగా "బలూచిస్థాన్ గురించి ప్రపంచం ఆలోచించాలంటూ"  ఉన్న బ్యానర్​తో కూడిన విమానం గాలిలో చక్కర్లు కొట్టింది.

By

Published : Jul 11, 2019, 8:01 PM IST

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్

రాజకీయ సందేశాలతో ఉన్న బ్యానర్​లు ప్రపంచకప్​లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచ్​ జరుగుతుండగా చిన్న చిన్న విమానాలు వీటిని తీసుకుపోతున్నాయి. దీనిపై ఐసీసీ ఆగ్రహంగా ఉంది. బర్మింగ్​హామ్​ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్​ సెమీఫైనల్​లోనూ ఇలాంటి దృశ్యమే కనబడింది. బలూచిస్థాన్​ గురించి ప్రపంచం ఆలోచించాలని అందులో రాసుంది.

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగే మైదానంపైన వివాదస్పద సందేశంతో విమానం

ప్రపంచకప్​లో ఇలా జరగడం ఇదేమి తొలిసారి కాదు. లీగ్​ దశలో టీమిండియా- శ్రీలంక మ్యాచ్​ జరిగే సమయంలోనూ.."జస్టిస్ ఫర్ కశ్మీర్","కశ్మీర్​పై భారత్​ ఆలోచించాలి","భారత్​లో మూక దాడులు ఆపాలి" అంటూ రాసిన బ్యానర్​లు తీసుకుపోయాయి విమానాలు. ఇదే కాకుండా పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మ్యాచ్​లోనూ "బలూచిస్థాన్​"కు సంబంధించిన బ్యానర్​లు దర్శనమిచ్చాయి.

ఈ విషయంపై ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అందుకే భారత్- న్యూజిలాండ్ మ్యాచ్​ జరిగే ప్రదేశం పరిసర ప్రాంతాల్లో 'నో ఫ్లయింగ్ జోన్​'గా ప్రకటించారు. అయినప్పటికీ కొందరు రాజకీయ సందేశాలు రాసిన టీషర్ట్​లు రాసుకొచ్చి నిరసన తెలిపారు.

ఇది చదవండి: ఆకాశంలో వివాదాస్పద సందేశాలు... బీసీసీఐ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details