ఆస్ట్రేలియన్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఇంగ్లీష్ ఆటగాడు మొయిన్ అలీ అభిమానులను కోరాడు. అందరూ తప్పులు చేస్తారని, వ్యక్తిగతంగా వాళ్లు చాలా మంచి వారని తెలిపాడు
'వార్నర్, స్మిత్ మంచి వారు.. వారిని గౌరవించండి' - warner
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వ్యక్తిత్వంలో మంచి వారని.. వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ అభిమానులను కోరాడు. ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడబోతున్నారు వార్నర్, స్మిత్.
" మనమందరం ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తాం. అందరి జీవితాల్లో ఎత్తుపల్లాలుంటాయి. డేవిడ్, స్మిత్ వ్యక్తిత్వంలో చాలా మంచి వారు. అభిమానులు ప్రపంచకప్‌ను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. ఆటగాళ్ల పట్ల మర్యాద పూర్వకంగా ఉండాలని కోరుతున్నా" -మొయిన్ అలీ ఇంగ్లండ్ ఆటగాడు
గత ఏడాది ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నారు. అనంతరం ఐపీఎల్లో పునరాగమనం చేసిన ఈ ఆటగాళ్లు చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సన్‌రైజర్స్ తరపున వార్నర్ 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోగా... రాజస్థాన్ తరపున స్మిత్ 10 మ్యాచుల్లో 319 పరుగులు చేశాడు.