తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: లంక బోణీ- పోరాడి ఓడిన అఫ్గాన్​ - శ్రీలంక

ప్రపంచకప్​లో శ్రీలంక బోణీ కొట్టింది. కార్డిఫ్​ వేదికగా అఫ్గానిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది లంక జట్టు. నాలుగు వికెట్లు తీసిన నువాన్​ ప్రదీప్..​ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. వర్షం వల్ల మ్యాచ్​ను 41 ఓవర్లకు కుదించారు అంపైర్లు.

లంక బోణీ- పోరాడి ఓడిన అఫ్గాన్​

By

Published : Jun 4, 2019, 11:52 PM IST

Updated : Jun 6, 2019, 12:02 AM IST

డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 187 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ను 32.4 ఓవర్లకు 152 పరుగులకు పరిమితం చేసింది శ్రీలంక. నువాన్‌ ప్రదీప్‌ (4/31), లసిత్‌ మలింగ (3/39) అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. నజీబుల్లా (43; 56 బంతుల్లో 6×4) చివరి వరకు పోరాడాడు. హజ్రతుల్లా (30), గుల్బదిన్‌ నయీబ్‌ (23) ఫర్వాలేదనిపించారు. అంతకు ముందు కుశాల్‌ పెరీరా (78; 81 బంతుల్లో 8×4), కరుణరత్నె (30; 45 బంతుల్లో 3×4) అదరగొట్టడంతో 36.5 ఓవర్లకు లంక 201 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. 4 వికెట్లతో సత్తా చాటిన నువాన్​ ప్రదీప్​కు 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​' దక్కింది.

57 పరుగులకే 5 వికెట్లు...

187 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి దిగిన అఫ్గాన్ జట్టు​ ఆరంభంలో ఓవరుకు కనీసం ఒక బౌండరీ బాదింది. విధ్వంసకర బ్యాట్స్​మెన్​ షెహజాద్​ ఔట్ అవ్వడం వల్ల ఒత్తిడికి గురైంది​. పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్న లంకేయులు బౌన్సర్​లతో విరుచుకుపడ్డారు. దీంతో వెంట వెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది అఫ్గాన్​. రన్​ రేట్​ క్రమంగా తగ్గిపోయింది. హజ్రతుల్లా జజాయ్​ 30 పరుగులు చేశాడు.

ఓ దశలో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్​ను సారథి గుల్పదిన్​ నయీబ్ సహాయంతో నజీబుల్లా జద్రాన్ గాడిన పెట్టాడానికి ప్రయత్నించాడు. లంక స్వింగ్​ను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ స్కోర్​ బోర్డును ముందుకు నడిపించింది. కానీ నయీబ్​ను ఔటవడం వల్ల వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. 32వ ఓవరు చివరి బంతికి జద్రాన్​ రనౌట్​ అవ్వడం వల్ల అఫ్గాన్​ ఆశలకు తెరపడింది.

అంతకు ముందు టాస్​ ఓడి తొలుత బౌలింగ్​ చేసిన లంక 36.5 ఓవర్లకు 201 పరుగులు చేసింది. అఫ్గాన్​ ఆల్​రౌండర్​ నబీ ధాటికి లంక మిడిల్​ ఆర్డర్​ కుప్పకూలింది. ఓపెనర్​ కుశాల్​ పెరీరా మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.

అఫ్గాన్​ బౌలర్లలో నబీ 4 వికెట్లతో విజృంభించగా, రషీద్​, దవ్లాత్​ తలో రెండు వికెట్లు​ పడగొట్టారు. హసన్ ఒక వికెట్​ తీశాడు.

Last Updated : Jun 6, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details