తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాణించిన విండీస్ బ్యాట్స్​మెన్.. అఫ్గాన్ లక్ష్యం 312 - world cup

హెడింగ్లే వేదికగా అప్గానిస్థాన్​తో జరుగుతోన్న మ్యాచ్​లో విండీస్ 311 పరుగులు చేసింది. కరీబియన్ బ్యాట్స్​మెన్ షై హోప్, లుయీస్, నికోలస్ పూరన్ అర్ధశతకాలతో మెరిశారు. అఫ్గాన్ బౌలర్లలో దౌలత్ జాడ్రాన్ 2.. రషీద్, నబీ, షిర్జాద్ చెరో వికెట్ తీశారు.

అఫ్గాన్

By

Published : Jul 4, 2019, 7:03 PM IST

ప్రపంచకప్​లో భాగంగా అఫ్గానిస్థాన్​తో జరగుతోన్న మ్యాచ్​లో వెస్టిండీస్ ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. హెడింగ్లే వేదికగా జరుగుతోన్న ఈ పోరులో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కరీబియన్ బ్యాట్స్​మెన్ హోప్(77), ఎవిన్ లూయిస్(58), నికోలస్ పూరన్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అప్గాన్ బౌలర్లలో దౌలత్ జడ్రాన్ రెండు వికెట్లు తీయగా.. నబీ, రషీద్, షిర్జాద్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన విండీస్​కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తన కెరీర్​లో చివరి ప్రపంచకప్​ మ్యాచ్​ ఆడుతోన్న గేల్ నిరాశపర్చాడు. జట్టు స్కోరు 21 పరుగులున్నప్పుడే గేల్ పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన లుయీస్ - షై హోప్ జోడి నిలకడగా ఆడింది. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఈ ద్వయాన్ని రషీద్ ఖాన్​ విడదీశాడు. లూయిస్​ను ఔట్ చేసి విండీస్​ను కట్టడి చేశాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన హెట్​మియర్ సాయంతో ఇన్నింగ్స్​ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు హోప్. వీరిద్దరూ 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ధాటిగా ఆడే ప్రయత్నంలో జడ్రాన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు హెట్​మియర్​. కాసేపటికే హోప్​ నబీ బౌలింగ్​లో వెనుదిరిగాడు.
చివర్లో నికోలస్ పూరన్ - జాసన్ హోల్డర్ జోడి దూకుడుగా ఆడింది. వికెట్లు నిలబెట్టుకుంటూనే వేగంగా పరుగులు రాబట్టింది. ఐదో వికెట్​కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుస బంతుల్లో ఇద్దరూ ఔటయ్యారు నికోలస్ (58) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, హోల్డర్ 45 పరుగులతో రాణించాడు.

అఫ్గాన్ బౌలర్లలో దౌలత్ జాడ్రాన్ 2 వికెట్లు తీయగా.. రషీద్, నబీ, షిర్జాద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇవీ చూడండి.. 'రోహిత్ లాంటి బ్యాట్స్​మనే అక్కడ ఆడగలడు'

ABOUT THE AUTHOR

...view details