తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐదు టైటిళ్లను మిస్ చేసుకున్న టీమిండియా

లీగ్ మ్యాచ్​ల్లో సత్తాచాటి కీలక మ్యాచ్​ల్లో చేతులెత్తేస్తోంది టీమిండియా. ఇలా గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లను చేజార్చుకుంది. న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

By

Published : Jul 11, 2019, 9:38 AM IST

మ్యాచ్​

2011లో వరల్డ్​కప్​ గెలుపు అనంతరం రెండేళ్లకు ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోఫీ విజయం సాధించింది భారత్​.. అప్పటినుంచి టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందని ద్రాక్షలా మిగిలింది. లీగ్ మ్యాచ్​ల్లో సత్తా చాటి ఆఖరులో విఫలమౌతుంది. గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లు చేజార్చుకుంది టీమిండియా.

2014 టీ 20 వరల్డ్​కప్​..

ధోని సారథ్యంలో టీమిండియా లీగ్ మ్యాచ్​లన్నింటిలో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్​లోనూ ఓటమి లేకుండా ఫైనల్ చేరింది. తుదిపోరులో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ​130 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది లంక జట్టు.

2015 ప్రపంచకప్​..

2015 మెగాటోర్నీలోనూ అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించింది టీమిండియా. ఆరు లీగ్ మ్యాచ్​ల్లో వరుస విజయాలు సాధించింది. అయితే సెమీస్​లో ఆస్ట్రేలియాపై 95 పరుగుల తేడాతో ఓడి టైటిల్​ ఆశలపై నీళ్లు చల్లుకుంది.

2015 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్

2016 టీ 20 ప్రపంచకప్​...

ఈ టోర్నీలో జరిగిన లీగ్ మ్యాచ్​ల్లో న్యూజిలాండ్​పై మినహ మిగతా అన్ని జట్లపై గెలిచింది టీమిండియా. పాకిస్థాన్​, బంగ్లాను కూడా ఓడించింది. అయితే సెమీస్​లో వెస్టిండీస్​ ముందు బోల్తా పడింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచినా.. కట్టడి చేయడంలో విఫలమైంది భారత్​.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ..

ఈ టోర్నీలో టీమిండియా.. శ్రీలంకతో మినహా ఫైనల్​ వరకు ఏ ఒక్క మ్యాచ్​లోనూ ఓడలేదు. అయితే తుదిపోరులో పాకిస్థాన్​పై ఘోరఓటమిని చవిచూసింది. 124 పరుగుల తేడాతో పరాజయం చెందింది. లీగ్ మ్యాచ్​లో పాక్​పై గెలిచిన భారత్​ ఫైనల్లో చిత్తయింది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ

2019 వరల్డ్​కప్​..

ఈ మెగాటోర్నీ లీగ్​దశలో ఇంగ్లాండ్​పై మినహా ప్రతి జట్టుపై గెలిచింది భారత్​. ఫేవరేట్లుగానూ టీమిండియానే పరిగణించారు. కీలక సెమీఫైనల్​ పోరులో కివీస్​ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జడేజా (77), ధోని(50) అర్ధశతకాలతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఇలా గత ఐదేళ్లలో 5 ఐసీసీ టైటిళ్లను కోల్పోయింది భారత్. లీగ్​ దశలో బాగా ఆడుతున్న టీమిండియా నాకౌట్​ మ్యాచ్​లలో చతికిలపడుతోంది. సమన్వయలోపమో, గెలుస్తామనే అతివిశ్వాసమో, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడమో తెలియదు కానీ కీలక మ్యాచ్​లలో సత్తాచాటలేకపోతోంది భారత్​.

ఇది చదవండి: 'అన్ని సార్లూ వాళ్లే ఆడాలంటే ఎలా?'

ABOUT THE AUTHOR

...view details