తెలంగాణ

telangana

ETV Bharat / sports

36 ఏళ్ల క్రితం ప్రపంచకప్​ను​ ముద్దాడిన క్షణం.. - won

అది 1983 ప్రపంచకప్​. తొలిసారి ఫైనల్ చేరిన భారత్​ ఓ వైపు.. రెండు సార్లు ఛాంపియన్​గా నిలిచిన వెస్టిండీస్ మరోవైపు. ఫలితం ఏకపక్షమే అనుకున్నారు అందరు. కానీ సమష్టి కృషితో ప్రపంచకప్​ ఫైనల్లో విండీస్​ను చిత్తుచేసి భారత్​ తొలిసారి ప్రపంచకప్​ను ముద్దాడింది. ఆ అద్భుత ఘట్టం జరిగి నేటికి 36 ఏళ్లు. 1983 జూన్ 25న భారత్​ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

ప్రపంచకప్​

By

Published : Jun 25, 2019, 5:02 AM IST

Updated : Jun 25, 2019, 7:17 AM IST

ఇప్పటిలా భారత్​ 1983 వరల్డ్​కప్ ఫేవరెట్​కాదు. అప్పుడు టీమిండియా ఓ చిన్న జట్టు.. ఎలాంటి అంచనాలు లేవు.. లీగ్ దశ దాటితే చాలనుకున్నారు. సెమీస్​లో ఇంగ్లాండ్​ను చిత్తుచేసింది. రెండు సార్లు విశ్వవిజేత విండీస్​ను ఫైనల్​లో ఓడించి తొలిసారి ఛాంపియన్ అయింది భారత్. సరిగా 36 ఏళ్ల క్రితం ఇదే రోజు(జూన్ 25)న కపిల్​దేవ్​ సారథ్యంలో వరల్డ్​కప్​ను ముద్దాడింది టీమిండియా.

ఆ ప్రపంచకప్​లో ఒక్కో జట్టుతో రెండు మ్యాచ్​లు ఆడింది ప్రతీ టీమ్​. 60 ఓవర్ల ఆట. తొలి రెండు మ్యాచ్​లు వెస్టిండీస్​, జింబాబ్వేపై గెలిచింది భారత్​. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్​లో 162 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్​తో రెండోసారి జరిగిన మ్యాచ్​లో పరాజయం చెందింది. తర్వాత ఆస్ట్రేలియా, జింబాబ్వేపై నెగ్గి సెమీస్​కు దూసుకెళ్లింది భారత్​.

ప్రపంచకప్​తో కపిల్​

కపిల్ అద్భుత ఇన్నింగ్స్​..

ముఖ్యంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న భారత్​ను కపిల్​దేవ్ ఆదుకున్నాడు. 138 బంతుల్లో 175 పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ​ ఫలితంగా టీమిండియా 31 పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం సెమీస్​లో ప్రమాదకర ఇంగ్లాండ్​ను 6 వికెట్లు తేడాతో ఓడించింది భారత్​.

1983 ప్రపంచకప్ జట్టు

విండీస్​తో తుదిపోరు..

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కృష్ణమాచారి శ్రీకాంత్(38) ఒక్కడే టాప్ స్కోరర్​.

తర్వాత బ్యాటింగ్​కు దిగిన విండీస్ 50 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోయి మంచి స్థితిలో ఉంది. ప్రమాదకర వివ్ రిచర్డ్స్​(33) క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో మ్యాచ్​ను మలుపు తిప్పాడు భారత బౌలర్​ మదన్​లాల్. రిచర్డ్స్​ను ఔట్ చేసి విండీస్​ను దెబ్బతీశాడు. అనంతరం కరీబియన్ ఆటగాళ్లు ఒక్కోక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. 52 ఓవర్లలో 140 పరుగుల వద్ద విండీస్ ఆలౌటైంది. భారత్​ తొలిసారి విశ్వవిజేతైంది.

మూడోసారి ముచ్చట తీరుస్తారా..?

36 ఏళ్ల క్రితం తొలిసారి ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్ అనంతరం 2011లో ధోనీ సారథ్యంలో రెండోసారి ముద్దాడింది. ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలో 2019 వరల్డ్​కప్​లో ఫేవరెట్​గా బరిలో దిగింది టీమిండియా. ఈ టోర్నీలో అద్భుత విజయాలతో దూసుకుపోతున్న భారత్​ ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కోరిక తీర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, సాతాఫ్రికా, పాకిస్థాన్​ లాంటి జట్లను ఓడించింది టీమిండియా.

రెండు ప్రపంచకప్​లతో మాజీ సారథులు

1983 మధుర క్షణాలను భారతీయులకు మరోసారి చూపించేందుకు బాలీవుడ్​లో '83' సినిమా రాబోతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కపిల్​దేవ్ పాత్రలో రణ్​వీర్ సింగ్ నటిస్తున్నాడు. దీపికా పదుకునే కీలకపాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Last Updated : Jun 25, 2019, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details