తెలంగాణ

telangana

ETV Bharat / sports

జింబాబ్వే వేదికగా వన్డే ప్రపంచకప్​ క్వాలిఫైయర్స్​ - జింబాబ్వేలో ప్రపంచకప్​ క్వాలిఫైయర్స్​

2023 వన్డే ప్రపంచకప్ కొత్త షెడ్యూల్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించింది.​ 2023 అక్టోబరు-నవంబరులో రీషెడ్యూల్​ చేసిన టోర్నీకి భారత్​ వేదిక కానున్నట్లు తెలిపింది. వరల్డ్​కప్​ క్వాలిఫైయర్స్​ను జింబాబ్వేలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Zimbabwe to host qualifiers of 2023 ODI World Cup to be held in India
జింబాబ్వే వేదికగా వన్డే ప్రపంచకప్​ క్వాలిఫైయర్స్​

By

Published : Dec 16, 2020, 9:03 PM IST

వన్డే ప్రపంచకప్​- 2023 అర్హత పోటీల షెడ్యూల్​ను బుధవారం అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. జూన్​ 18 నుంచి జులై 9 వరకు జరగనున్న ఈ క్వాలిఫైయర్స్​ను జింబాబ్వేలో నిర్వహించనున్నట్లు తెలిపింది.

2023లో జరగబోయే వన్డే ప్రపంచకప్​ను భారత్​ వేదికగా నిర్వహించనున్నారు. అయితే కరోనా కారణంగా ఈ టోర్నీని అదే ఏడాది అక్టోబరు-నవంబరుకు రీషెడ్యూల్​ చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​-7 స్థానాల్లో ఉన్న జట్లు టోర్నీకి సరాసరి అర్హత సాధిస్తాయి. క్వాలిఫైయర్స్​లో విజేతగా నిలిచిన టీమ్​ 8వ జట్టుగా టోర్నీలో చేరుతుంది.

దీంతో పాటు ప్రపంచ క్రికెట్​ లీగ్​ 2, ఛాలెంజ్​ లీగ్​ షెడ్యూల్​నూ ఐసీసీ ప్రకటించింది. ఈ లీగును వచ్చే ఏడాది మార్చి 19 నుంచి యూఎస్​ఏ, నేపాల్​ వేదికగా నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి:భారత్ x ఆస్ట్రేలియా: 'గులాబి' ఏం మాయ చేస్తుందో?

ABOUT THE AUTHOR

...view details