ఇటీవలే జింబాబ్వే క్రికెట్ బోర్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి నిషేధం విధించింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా సెప్టెంబర్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్తో జరిగే టీ20 ట్రై సిరీస్లో ఆడమని తేల్చిచెప్పింది జింబాబ్వే.
ఐసీసీకి జింబాబ్వే ఝలక్.. ట్రై సిరీస్కు నో - cricket
ఐసీసీ విధించిన నిర్ణయంపై సీరియస్గా ఉన్న జింబాబ్వే క్రికెట్ బోర్డు... బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్తో జరిగే టీ20 ట్రై సిరీస్లో పాల్గొనమని తెలిపింది. సెప్టెంబర్లో ఈ సిరీస్ జరగాల్సి ఉంది.
జింబాబ్వే
భవిష్యత్తులోనూ ఆడాల్సిన టోర్నీలను రద్దు చేసుకుంటామని స్పష్టం చేసింది. ఐసీసీతో సఖ్యతగా వ్యవహరించి యథాతథంగా తమ కార్యకలాపాలను కొనసాగించాలని అనుకుంటున్నామని జింబాబ్వే బోర్డు తెలిపింది. ఎంత వీలైతే అంత తొందరగా తమ ఆటగాళ్లు మళ్లీ క్రికెట్ ఆడితే చూడాలని ఉందని వెల్లడించింది.
ఇవీ చూడండి.. ఆర్మీ శిక్షణ కోసం ధోనికి గ్రీన్ సిగ్నల్