ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల సంచలన ఇన్నింగ్స్ ఆడిన పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్.. వన్డే ర్యాంకింగ్స్లో దూకుడు చూపించాడు. ఏడు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 193 పరుగులు చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్గా నిలిచాడు.
బంగ్లాదేశ్తోపై ఇటీవల టీ20తో అరంగేట్రం చేసిన కివీస్ క్రికెటర్ ఫిన్ అలెన్.. టాప్-100లో చోటు దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్లో 29 బంతుల్లో 71 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు.