తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, రాహుల్​ను ట్రోల్ చేసిన చాహల్ - cricket news

టీమిండియా స్టార్ బ్యాట్స్​మెన్ కోహ్లీ, రాహుల్.. తన షాట్​ను అనుకరిస్తున్నారంటూ ట్విట్టర్​లో రాసుకొచ్చాడు బౌలర్ చాహల్. ఇప్పుడీ ఫొటో వైరల్​గా మారింది.

కోహ్లీ, రాహుల్​ను ట్రోల్ చేసిన చాహల్
భారత బౌలర్ చాహల్

By

Published : Jan 29, 2020, 12:38 PM IST

Updated : Feb 28, 2020, 9:36 AM IST

భారత బౌలర్ చాహల్.. ఎప్పుడూ జోకులేస్తూ, సహచరుల్ని 'చాహల్ టీవీ' పేరుతో ఇంటర్య్వూలు చేస్తూ సరదాగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏకంగా కెప్టెన్​ కోహ్లీ, బ్యాట్స్​మన్ రాహుల్​ను ట్రోల్ చేశాడు. వారిలా అప్పర్​ కట్​ అడుతున్న ఫోజిచ్చి, ఆ ఫొటోను తన ట్విట్టర్​లో పంచుకున్నాడు. "నా షాట్​ను వారు కాపీ కొడుతున్నారు. నాట్ బ్యాడ్​ యంగస్టర్స్" అంటూ ఓ సరదా వ్యాఖ్య రాసుకొచ్చాడు.

ప్రస్తుతం చాహల్.. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈరోజు హామిల్టన్​ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్​లో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్​ గెలిచి సిరీస్​ పట్టేయాలని చూస్తోంది.

Last Updated : Feb 28, 2020, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details