టీమ్‌ఇండియా క్రికెటర్లు రోహిత్‌శర్మ, యుజువేంద్ర చాహల్ ఇద్దరూ టామ్ అండ్ జర్రీలా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు సరదా జోక్‌లు వేసుకుంటూ అభిమానులను అలరిస్తారు. ఒక్కోసారి తమ జట్టు సభ్యులనూ ఉత్సాహపరుస్తుంటారు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన వీరిద్దరూ పలు సందర్భాల్లో హాస్యభరిత కామెంట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుండగా చాహల్‌ను ఎద్దేవా చేశాడు. అతడి టిక్‌టాక్ వీడియోలపై స్పందించమని ఓ అభిమాని అడగ్గా.. చాహల్ ఆ వీడియోలతో మతి పోగొట్టేస్తాడని స్పష్టం చేశాడు. అలాగే మరో అభిమాని అడిగిన ఓ సరదా ప్రశ్నకూ ఆ స్పిన్నర్‌నే జవాబు అడగండని చెప్పాడు. అలా హిట్‌మ్యాన్ తన సహచర ఆటగాడిపై జోకులు చేశాడు.
రోహిత్ శర్మను అమ్మాయిగా మార్చేసిన చాహల్! - రోహిత్ శర్మ చాహల్
సహచర క్రికెటర్ రోహిత్ శర్మ.. అమ్మాయి రూపంలో ఎలా ఉంటాడో చెబుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశాడు బౌలర్ చాహల్. దీనికి అభిమానుల నుంచి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే చాహల్ గురువారం మరో అడుగు ముందుకేసి ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. రోహిత్ శర్మ అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుందనే ఆసక్తిని రేకెత్తించాడు. ట్విటర్‌లో అతడి ఫొటోను పంచుకున్న చాహల్.. పక్కనే అతడి మహిళా రూపాన్ని జతచేశాడు. దానికి 'రోహితా శర్మా భయ్యా' చాలా అందంగా ఉన్నావ్ అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడించాడు.
అయితే, చాహల్ పోస్టు చేసిన ఆ ఫొటోలో రోహిత్ బొమ్మ నిజంగానే చాలా అందంగా ఉంది. ఆ ఫొటో చూస్తే అది రోహిత్ అని గుర్తుపట్టలేని విధంగా ఉంది. దానికి అభిమానుల నుంచి తెగ లైకులు, కామెంట్లు వస్తున్నాయి. దీనితో పాటే మిగతా క్రికెటర్ల ఆడరూపానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.