తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెలిచిన ఆనందంలో గంతులేసిన భారత క్రికెటర్లు - india vs new zealand 2020

న్యూజిలాండ్​పై టీ20 సిరీస్​ గెల్చిన ఆనందంలో మైదానంలోనే డ్యాన్స్​ చేశారు భారత క్రికెటర్లు చాహల్-శ్రేయస్ అయ్యర్. ఆ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది టీమిండియా.

గెలిచిన ఆనందంలో గంతులేసిన చాహల్-శ్రేయస్
చాహల్-శ్రేయస్ డ్యాన్స్

By

Published : Feb 3, 2020, 9:57 AM IST

Updated : Feb 28, 2020, 11:39 PM IST

న్యూజిలాండ్​ను వారిగడ్డపైనే తొలిసారి ఓడించి, సిరీస్​ను సొంతం చేసుకుంది టీమిండియా. 5-0 తేడాతో గెల్చుకుని చరిత్ర సృష్టించింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్​ల్లో కోహ్లీసేన ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత, అభిమానులే కాదు.. మైదానంలో భారత క్రికెటర్లు ఆనందంతో గంతులేశారు. వారిలో చాహల్-శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆ వీడియోను టీమిండియా తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. విక్టరీ డ్యాన్స్​ అంటూ క్యాప్షన్​ జోడించింది.

ఆదివారం జరిగిన చివరి మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత్.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్​ మొత్తంగా ఆకట్టుకున్న కేఎల్ రాహుల్​.. 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్​'గా నిలిచాడు. బుమ్రాను 'మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్'​ అవార్డు వరించింది.

ఈ బుధవారం నుంచి కివీస్​తో వన్డే సిరీస్​ ఆడనుంది కోహ్లీసేన. ఇందులో భాగంగా మూడు మ్యాచ్​లు జరగనున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టులు ఆడనుంది.

Last Updated : Feb 28, 2020, 11:39 PM IST

ABOUT THE AUTHOR

...view details