కరోనా దెబ్బతో క్రికెట్ టోర్నీలన్నీ రద్దవడం వల్ల క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలో కొందరు కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటే, మరికొందరు ఇష్టమైన వ్యాపకాలతో బిజీగా ఉన్నారు. తాజాగా భారత జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ మాత్రం తనలోని నటనకు పనిచెప్పాడు. సామాజిక మాధ్యమం టిక్‌టాక్‌లో ఓ చిన్నపాటి వీడియో చేశాడు. దాన్ని అభిమానులతో పంచుకోగా నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.
వైరల్: చాహల్ బుగ్గలుగిల్లి పారిపోయిన అమ్మాయి - Yuzvendra Chahal news
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ తెలియనివారు ఉండరేమో. ఎందుకంటే ఆటతోనే కాకుండా తనదైన రీతిలో కామెంటరీతో క్రికెట్ ప్రియులను అలరిస్తుంటాడు. తాజాగా ఇతడిని ఓ అమ్మాయి బుగ్గగిల్లి పారిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందులో చాహల్ నడిచి వెళ్తూ.. షూ లేస్ కట్టుకునేందుకు వంగుతాడు. ఓ అమ్మాయి అతడి వెనక దాక్కుని ఆటపట్టిస్తుంది. అయితే ఆమెపై సరదాగా చాహల్ చేయి ఎత్తగా... వెంటనే ఆ అమ్మడు క్రికెటర్ బుగ్గలు గిల్లి పారిపోతుంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
గతంలోనూ చాహల్.. సహా ఆటగాళ్లతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేశాడు. క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో 'చాహల్ టీవీ' పేరుతో అతడు చేసే ఇంటర్వూలు బాగా ఆకట్టుకుంటాయి. ఈ స్పిన్నర్ చివరిగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో బరిలోకి దిగాడు. వచ్చే నెలలో ప్రారంభంకానున్న ఐపీఎల్లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నాడు.