వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా లెగ్‌స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు(52) తీసిన క్రికెటర్‌గా నిలిచి అశ్విన్ సరసన చేరాడు. ఈ క్రమంలో బుమ్రా(51 వికెట్లు) రికార్డును అధిగమించాడు.
రికార్డు: బుమ్రాను అధిగమించిన స్పిన్నర్ చాహల్ - చాహల్-బుమ్రా
విండీస్‌తో తొలి టీ20లో హెట్మయిర్ వికెట్ తీసిన చాహల్.. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా(51)ను అధిగమించాడు.
యజ్వేంద్ర చాహల్
టీ20ల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో(34) 50 వికెట్లు అందుకున్న భారత క్రికెటర్‌గా చాహల్ ఇప్పటికే రికార్డు సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్(26) అగ్రస్థానంలో ఉన్నాడు.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది కోహ్లీసేన. ఈ పోరులో కోహ్లీ (94 నాటౌట్) విశ్వరూపం చూపించి, కరీబియన్ల పనిపట్టాడు. రాహుల్(62 పరుగులు) తన వంతు పాత్ర పోషించాడు.