టీమ్‌ఇండియా అల్లరి కుర్రాడు యుజువేంద్ర చాహల్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టేశాడు. మంగళవారం తాను ప్రేమించిన అమ్మాయి కొరియోగ్రాఫర్ ధనశ్రీని మనువాడాడు. ఇరువురి కుటుంబాల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ మేరకు తమ పెళ్లి ఫొటోను ట్వీట్ చేశాడు చాహల్.
వివాహ బంధంతో ఒక్కటైన చాహల్- ధనశ్రీ
టీమ్‌ఇండియా బౌలర్ యుజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ మంగళవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు చాహల్.
చాహల్
లాక్డౌన్లో తాను ధనశ్రీతో ప్రేమలో పడినట్లు తెలిపి అందరినీ షాక్కు గురిచేశాడు చాహల్. ఆ తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయింది. ఇటీవల ఆసీస్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చాడు చాహల్. ఈ క్రమంలోనే మంగళవారం పెళ్లి పీటలెక్కారు ఈ నూతన వధూవరులు.
ఇదీ చూడండి :బీచ్లో సరదాగా గడుపుతోన్న చాహల్-ధనశ్రీ