తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భజ్జీ.. స్కేటింగ్​ ఎలా చేస్తారో చూపించవా!' - స్కేట్​బోర్డుతో హర్భజన్​

స్కేట్​ బోర్డుతో ఫొటోషూట్​ చేసిన చిత్రాలను తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు వెటరన్​ క్రికెటర్​ హర్భజన్​ సింగ్​. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్​ యువరాజ్ ​సింగ్ ఫన్నీ కామెంట్ చేశాడు.

Yuvraj Singh trolled Harbhajan Singh to show some skating performance
'భజ్జీ.. స్కేటింగ్​ ఎలా చేస్తారో చూపించవా!'

By

Published : Jun 29, 2020, 10:34 AM IST

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో అభిమానులతో పంచుకున్నాడు. అందులో స్కేట్​ బోర్డును పట్టుకుని నిలబడ్డాడు. అది చూసిన యువరాజ్‌ సింగ్‌.. భజ్జీని ఓ సరదా కోరిక కోరాడు. "పాజీ కొంచెం స్కేటింగ్‌ చేసి చూపియ్‌" అని అడిగాడు. అందుకు స్పందించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ అంతే సరదాగా జవాబిచ్చాడు. "ఇద్దరం కలిసి చేద్దాం" అని రిప్లై ఇచ్చాడు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

హర్భజన్​ సింగ్​ ఇన్​స్టాగ్రామ్​ పోస్టు

టీమ్‌ఇండియాలో హర్భజన్‌, యువీ ఎంతో సరదాగా ఉంటారు. మైదానంలో ఎంత చలాకీగా ఉంటారో సామాజిక మాధ్యమాల్లోనూ అలాగే ఉంటారు. తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ గతవారం ఫేస్ ‌స్వాప్‌ ద్వారా టీమ్‌ఇండియా క్రికెటర్ల ఆడరూపాలు పంచుకున్నారు. యువీ తొలుత ప్రస్తుత క్రికెటర్ల ఆడ ముఖాల ఫొటోలు పంచుకోగా, తర్వాత భజ్జీ తన సహచరుల ఫొటోలు పంచుకున్నాడు. అవి కూడా నెటిజన్లను ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి... ప్రేమాట: ఔను.. వాళ్లిద్దరినీ క్రీడలే కలిపాయి

ABOUT THE AUTHOR

...view details