తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దేవుడికి షేక్ హ్యాండ్​ ఇచ్చినట్లు అనిపించింది'

మాస్టర్ బ్లాస్టర్ సచిన్​తో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్న మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. అతడిని కలిసినప్పుడు దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించిందని పేర్కొన్నాడు.

సచిన్​ను కలిసి తొలి సందర్భాన్ని గుర్తు చేసుకున్న యువరాజ్
సచిన్ తెందుల్కర్-యువరాజ్ సింగ్

By

Published : Jun 11, 2020, 12:35 PM IST

దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ను తొలిసారి కలిసినప్పుడు దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించిందని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ అభివర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు యువీ వీడ్కోలు పలికి బుధవారానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సచిన్.. యువరాజ్‌ను గుర్తు చేసుకుంటూ, అతడిని తొలిసారి చెన్నై శిక్షణా శిబిరంలో చూశానని, అప్పుడే అతడి శక్తిసామర్థ్యాలు గుర్తించానని ఓ ట్వీట్‌ చేశాడు. స్పందించిన యువీ.. లిటిల్‌ మాస్టర్‌ను తాను తొలిసారి కలిసిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

'ధన్యవాదాలు మాస్టర్‌. మనం తొలిసారి కలిసినప్పుడు, నేను దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకు నడిపించావు. నా శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగించావు. మీరు నాతో ఎలా ఉన్నారో.. నేనూ యువకులతో అలానే ఉన్నా. మీతో మరిన్ని మధురజ్ఞాపకాలు పంచుకోడానికి ఎదురుచూస్తుంటా' అని యువీ రీట్వీట్‌ చేశాడు. అంతకుముందు సచిన్‌ ట్వీట్‌లో.. 'నిన్ను తొలిసారి చెన్నై శిక్షణ శిబిరంలో చూశా. అప్పుడు నేను నీకు సాయం చేయలేకపోయా. అయితే, నీ వేగం, చురుకుదనం, అథ్లెటిక్‌ శరీరం తదితర అంశాలను అప్పట్లోనే గుర్తించా. సిక్సర్లు కొట్టే నీ సామర్థ్యం అద్భుతం. ఏ మైదానంలోనైనా బంతిని స్టాండ్స్‌లోకి పంపించగలనని ప్రపంచానికి చాటి చెప్పావ్' అని పేర్కొన్నాడు.

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్

1989 డిసెంబరు 18న క్రికెట్​లోకి అరంగేట్రం చేసిన సచిన్.. 2013లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించి మాస్టర్ బ్లాస్టర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,921 పరుగులు, టీ20ల్లో 10, ఐపీఎల్​లో 2334 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

యువరాజ్ సింగ్.. 2000 నుంచి 2019 వరకు క్రికెట్​లో కొనసాగాడు. 2007, 2011 ప్రపంచకప్​లలో భారత్ కప్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్​ మొత్తంలో 11, 778 పరుగులు చేసి, 148 వికెట్లు తీశాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details