తెలంగాణ

telangana

ETV Bharat / sports

'తెలంగాణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' - తెలంగాణ వర్షలు యువరాజ్ సింగ్

భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. వరదల్లో మరణించిన వారికి, బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశాడు.

Yuvraj Singh pray for Telangana
'తెలంగాణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా'

By

Published : Oct 16, 2020, 10:35 AM IST

భారీ వర్షాలతో అల్లకల్లోలమైన తెలంగాణ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ పేర్కొన్నాడు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్‌ చేశాడు.

"తెలంగాణలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అయితే.. పెద్దమొత్తంలో నష్టమేమీ జరగలేదు. కష్టకాలంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారు. వరద ప్రభావంతో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరణించిన వారికి, బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టకాలం నుంచి తెలంగాణ త్వరగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దయచేసి మీరంతా సురక్షితంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా."

-యువరాజ్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కుంభవృష్టి సృష్టించింది. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రం చిగురుటాకులా వణికింది. రాజధాని హైదరాబాద్‌ అయితే అస్తవ్యస్తమైంది. గత 33 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా దాదాపు వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో తీవ్ర స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ABOUT THE AUTHOR

...view details