తెలంగాణ

telangana

ETV Bharat / sports

పీటర్సన్​కు యువరాజ్ దిమ్మతిరిగే కౌంటర్ - ప్రపంచకప్​ 2019

ఇంగ్లాండ్​ మాజీ ఆటగాడు పీటర్సన్​కు ట్విట్టర్​లో దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు యువరాజ్ సింగ్. ప్రపంచకప్​లో సెమీస్​కు ముందు అర్హత సాధించండి, తర్వాత కప్పు గురించి మాట్లాడండి అంటూ తన ట్వీట్​కు ప్రతిగా స్పందించాడు.

పీటర్సన్​కు యువరాజ్ దిమ్మదిరిగే కౌంటర్

By

Published : Jul 3, 2019, 12:35 PM IST

ప్రపంచకప్​ ఆసక్తికరంగా సాగుతోంది. మంగళవారం బర్మింగ్​హామ్​లో జరిగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై నెగ్గిన భారత్ జట్టు​ సెమీస్​లో అడుగుపెట్టింది. ఇది జరుగుతుండగానే ట్విట్టర్​లో ఇద్దరు మాజీ​ క్రికెటర్​ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇంగ్లాండ్​కు చెందిన కెవిన్ పీటర్సన్​కు టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.

అసలేం జరిగింది..

ఈ మ్యాచ్​లో టీమిండియా ఓపెనర్​ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్​లో అతడికిది నాలుగోది. దీనిపై స్పందించిన యువరాజ్... "ఐసీసీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్​ ట్రోఫీకి చేరువవుతున్నావంటూ" రోహిత్ శర్మను ట్యాగ్​ చేస్తూ ట్వీట్ చేశాడు.

"ఇంగ్లాండ్​ కప్పు గెలవకపోతే పై-చుకర్" అంటూ రిప్లై ఇచ్చాడు కెవిన్ పీటర్సన్.

"ముందు సెమీస్​కు అర్హత సాధించండి, ఆ తర్వాత కప్పు గెలవడం గురించి మాట్లాడు. నేను మాట్లాడేది కప్పు కోసం కాదు, మ్యాన్​ ఆఫ్ ద సిరీస్​ గురించి" అంటూ పీటర్సన్​కు దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చాడు యువరాజ్.

యువరాజ్ సింగ్- కెవిన్ పీటర్సన్ ట్వీట్ వార్

మంగళవారం చివరి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై 28 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. శతకంతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్​గా నిలిచాడు. జులై 6న శ్రీలంకతో తన చివరి లీగ్​ మ్యాచ్​ ఆడనుంది భారత జట్టు.

సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ

ఇది చదవండి: WC19: టీమిండియాకు బంగ్లా నేర్పిన పాఠం

ABOUT THE AUTHOR

...view details