టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి. చాహల్ ఇటీవలే తన తండ్రితో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియో గురించి యువీ స్పందించిన తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో తాజాగా ఈ సంభాషణ జరిగింది.
"చాహల్‌కు ఏమీ పని లేదనుకుంటా.. ఏ వీడియో షేర్ చేశాడో నువ్వు చూశావా" అని రోహిత్‌ను అడిగాడు యువరాజ్. దానికి రోహిత్ స్పందిస్తూ.."నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మీ నాన్న డ్యాన్స్ వీడియోను షేర్ చేశావు" అని బదులిచ్చాడు.