తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువీ మెరిసెన్​.. టొరంటో గెలిచెన్​...! - యువరాజ్ సింగ్

గ్లోబల్​ టీ20లో టొరంటో నేషనల్స్ తరఫున ఆడుతున్న టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అదరగొట్టాడు. 21 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

యువరాజ్ సింగ్

By

Published : Jul 28, 2019, 6:34 PM IST

Updated : Jul 28, 2019, 7:48 PM IST

యువరాజ్ సింగ్.. ఈ పేరు చెప్పగానే ఆరు బంతుల్లో ఆరు కళ్లు చెదిరే సిక్సులు గుర్తుకు వస్తాయి. స్టైలిష్​ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్​తో ఎంతో మంది అభిమానుల్ని సంపాందించిన యువీ.. ఇటీవలే క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం గ్లోబల్​ టీ20లో ఆడుతోన్న ఈ మాజీ టీమిండియా ఆటగాడు మరోసారి బ్యాట్​ పవర్ చూపించాడు. తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.

శనివారం ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందులో ఓ సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

టొరంటో నేషనల్స్​ ముందు ఎడ్మాంటన్‌ 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో స్థానంలో వచ్చిన యువరాజ్‌ తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించాడు. ఎడ్మాంటన్‌ బౌలర్ షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా కొట్టిన సిక్స్​ మ్యాచ్​కే హైలైట్​గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో హెన్రిచ్‌ క్లాసన్‌-యువరాజ్‌ ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇది సంగతి: 'కామన్వెల్త్​లో భారత్ ఆడాలన్నదే మా ఆకాంక్ష'

Last Updated : Jul 28, 2019, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details