తెలంగాణ

telangana

సిక్కుల సాయంతో కార్చిచ్చు బాధితులకు యువీ తోడ్పాటు

By

Published : Jan 7, 2020, 10:21 AM IST

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం యువరాజ్ సింగ్ ఉచితంగా ఆహారం అందించాడు. ఇందుకు సహకరించిన ఆసీస్ సిక్కు సామాజిక వర్గాన్ని ప్రశంసించాడు.

Yuvraj Singh hails Sikh community in Australia for serving free meals to bushfire victims
యువరాజ్ సింగ్

ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు క్రీడాప్రముఖులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే గ్లెన్ మ్యాక్స్​వెల్, క్రిస్​లిన్, షాట్, షేన్ వార్న్.. వారికి అండగా నిలిచేందుకు ముందడుగు వేశారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. కార్చిచ్చు బాధితుల కోసం ఆహారాన్ని అందించాడు.

ఆస్ట్రేలియాలోని సిక్కు సామాజిక వర్గం సాయంతో బాధితుల కోసం ఆహారం ప్యాకెట్లు అందించాడు యువీ. గత వారం ఈ ఫుడ్​ను కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వీళ్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్​బుక్​లో షేర్ చేశాడు యువరాజ్.


"బాధితులకు సాయమందించడంలో తోడ్పడిన ఆస్ట్రేలియా సిక్కు సామాజిక వర్గాన్ని ప్రశంసిస్తున్నా. మీ సాయం మానవత్వంపై నమ్మకం కలిగించింది. పరిస్థితి అదుపులో రావాలని ఆస్ట్రేలియా వాసుల కోసం ప్రార్థించండి" -యువరాజ్ సింగ్.

కార్చిచ్చు బాధితుల కోసం ఇప్పటికే షేన్ వార్న్ తన గ్రీన్ క్యాప్ వేలం వేయాలని నిర్ణయించగా.. బిగ్​బాష్​ లీగ్​లో తాము కొట్టే ప్రతి సిక్సర్​కు 250 ఆస్ట్రేలియా డాలర్లు సాయంగా ఇస్తామని మ్యాక్స్​వెల్, క్రిస్ లిన్, షాట్ ప్రకటించారు.

ఇదీ చదవండి: భారత్​తో టెస్టు సిరీస్ నోరూరిస్తుంది: పైన్

ABOUT THE AUTHOR

...view details