తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చాహల్​.. ఈ ఏడాదైనా బరువు పెరుగుతావా?' - yuzvendra chahal birthday

స్పిన్నర్ చాహల్​కు​ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన యువరాజ్ సింగ్.. ఈ ఏడాది అయినా సరే కొంచెం బరువు పెరగాలని సూచించాడు.

Yuvraj Singh dedicates hilarious post to Yuzvendra Chahal on birthday
'చాహల్​.. ఈ ఏడాదైనా బరువు పెరుగుతావా?'

By

Published : Jul 23, 2020, 1:39 PM IST

టీమ్​ఇండియా స్పిన్నర్​ యజువేంద్ర చాహల్.. నేడు(జులై 23) 30వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా సోషల్​మీడియాలో శుభాకాంక్షలు చెప్పాడు భారత మాజీ ఆల్​రౌండర్​​ యువరాజ్​ సింగ్​. 'మిస్టర్​ చుహా' అని​ సంభోదిస్తూ.. ఈ ఏడాది కూడా కెరీర్​ విజయవంతంగా కొనసాగించడం సహా కొంచెం బరువు పెరగాలని చమత్కరించాడు యువీ.

"చాహల్​ లేదా నిన్ను మిస్టర్​ చుహా అని పిలవొచ్చా? నీ ఫన్నీ వీడియోలు, మాటలతో మాకు వినోదాన్ని పంచుతూ, కెరీర్​నూ విజయవంతంగా కొనసాగించాలని భావిస్తున్నాను. నువ్వు కొంచెం బరువు కూడా పెరగాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు యజువేంద్ర చాహల్​"

-యువరాజ్​ సింగ్​, టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​

టీమ్​ఇండియా యువ స్పిన్నర్​ చాహల్​.. ఎన్నో సరికొత్త రికార్డులను నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్​లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్​గా ఘనత సాధించాడు. అదే ఫార్మాట్​లో 50 వికెట్ల మార్క్​ను వేగంగా అందుకున్న టీమ్​ఇండియా తొలి స్పిన్నర్​గానూ గుర్తింపు తెచుకున్నాడు.

2016లో అంతర్జాతీయ కెరీర్​ ప్రారంభించిన చాహల్.. ఐపీఎల్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్​ తరఫున కీలక బౌలర్​గా రాణిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details