వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఫీల్డింగ్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అధిక పని భారంతో మైదానంలో సరిగా ఫీల్డింగ్ చేయలేకపోతున్నారా? అని ప్రశ్నించాడు.
"భారత్ పేలవంగా ఫీల్డింగ్ చేసింది. బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు నిదానంగా కదులుతున్నారు. ఎక్కువగా క్రికెట్ ఆడుతుండటం వల్ల ఇలా చేస్తున్నారా?"
-యువరాజ్ సింగ్, మాజీ క్రికెటర్
ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్యాచ్‌లను జారవిడిచారు. షార్ట్ ఫైన్‌లెగ్‌లో క్యాచ్‌ను అంచనా వేయడంలో పొరబడ్డ సుందర్ రెండడుగులు వెనక్కి వెళ్లగా బంతి అతడి ముందు పడింది. చాహర్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా మూడు క్యాచ్‌లను జారవిడిచారు. వీటిలో రోహిత్ ఒక్క చేతితో అందుకోవడానికి యత్నించిన క్యాచ్ మాత్రమే కఠినమైనది.
ఇవీ చూడండి.. ఎఫ్‌ఐహెచ్ అవార్డు రేసులో మన్‌ప్రీత్