తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్​, బుమ్రాల సిక్స్​ప్యాక్​ పిక్.. యువీ ప్రశంసలు - ఆరుపలకల దేహంతో విరాట్​ బుమ్రా

భారత జట్టు సారథి విరాట్​ కోహ్లీ, ప్రధాన పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాల ఫిట్​నెస్​ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​. వీరిద్దరు ఆరు పలకల దేహంతో కనిపించిన ఫొటోలు ప్రస్తుతం అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.

విరాట్​, బుమ్రా ఫిట్​నెస్​పై యువీ ప్రశంసలు

By

Published : Aug 22, 2019, 4:31 PM IST

Updated : Sep 27, 2019, 9:32 PM IST

వెస్టిండీస్​ పర్యటనలో ఉన్న టీమిండియా... నేటి నుంచి తొలి టెస్టులో బరిలోకి దిగుతోంది. అయితే మ్యాచ్​కు ముందుకు కాస్త విరామం దొరకడం వల్ల జాలీ బీచ్​లో జాలీగా గడిపింది కోహ్లీ సేన. ఈ సందర్భంగా కోహ్లీ, బుమ్రాలు తీసుకున్న సిక్స్​ప్యాక్ ఫొటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి ఫిట్​నెస్​పై తాజాగా మాజీ క్రికెటర్​, సిక్సర్ల వీరుడు యువరాజ్​ సింగ్​ ప్రశంసలు కురిపించాడు. "ఓహ్‌.. ఫిట్‌నెస్‌ ఐడల్‌" అంటూ కామెంట్​ చేశాడు.

బుమ్రా, కోహ్లీ ఫొటోపై యువీ కామెంట్​

కొన్నేళ్లుగా కోహ్లీ ఫిట్‌నెస్‌ కోసం ఆహార నియంత్రణ పాటిస్తున్నాడు. తను మైదానంలో సులభంగా కదలడానికి, చురుకుగా ఉండటానికి వ్యాయామమే కారణమని చాలా సార్లు చెప్పాడు టీమిండియా కెప్టెన్​​.

ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను గెలుచుకుంది టీమిండియా. నేటి నుంచి రెండు టెస్టుల సిరీస్‌ కోసం కరీబియన్లతో తలపడనుంది కోహ్లీసేన. ఆంటిగ్వాలోని సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో సాయంత్రం 7గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Last Updated : Sep 27, 2019, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details