తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి జెర్సీలో యూవీ - ఐపీఎల్​ 2019

స్టార్ బ్యాట్స్​మెన్ యువరాజ్ సింగ్​ ఈ ఏడాది ఐపీఎల్​లో ముంబయి తరఫున ఆడనున్నాడు. గతేడాది పంజాబ్ తరఫున నిరాశపరిచిన ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్​ని ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. ఈసారి కనీస ధర కోటి రూపాయలకే సొంతం చేసుకుంది ముంబయి జట్టు.

ముంబయి జెర్సీలో యూవీ

By

Published : Mar 6, 2019, 7:30 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు యువరాజ్ సింగ్. ఆ జట్టు జెర్సీ ధరించిన ఫోటోను ముంబయి ఇండియన్స్ తన ట్విటర్​లో పంచుకుంది. ఇప్పటికే మూడు సార్లు విజేతగా నిలిచిన ఈ జట్టుకు యువీ రాక మరింత ఫ్యాన్ ఫాలోయింగ్​ను తీసుకొస్తుందని ముంబయి భావిస్తోంది.

గతేడాది పంజాబ్ తరఫున నిరాశపరిచిన ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్​ని ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. ఈసారి కనీస ధర కోటి రూపాయలకే సొంతం చేసుకుంది ముంబయి జట్టు.
  • "12వ నంబర్ జెర్సీలో కనిపించనున్నాడు యూవీ. దీని వెనక ఓ ఆసక్తికర కథ ఉంది. చండీఘర్ సెక్టార్-12లో 12 తేదీ 12వ నెలలో జన్మించాడు. అతని లక్కీ నంబరూ పన్నెండే."

ఇప్పటికే ఐపీఎల్​లో ఐదు జట్ల తరఫున ఆడిన యూవీకి ముంబయి ఆరవది. మార్చి 24న వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్​లో​ దిల్లీ కేపిటల్స్​తో రోహిత్ సేన తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details