క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడితే ఆ మజా వేరు. ఇరుజట్లు పోటీపడితే రెండు దేశాల ప్రజలు ఆసక్తిగా చూస్తారు. ఇక మైదానంలో బరిలోకి దిగిన ఆటగాళ్లయితే చెప్పక్కరలేదు. చావోరేవో అన్నట్లు పోరాడతారు. మరి ఇలాంటి మ్యాచ్‌లు దాదాపు చాలా ఏళ్లుగా జరగట్లేదు. ఐసీసీ టోర్నీలో ఎప్పుడో ఒకటో, రెండో మ్యాచ్‌లు మినహాయిస్తే ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లే లేవు. తాజాగా ఇరుదేశాల క్రికెట్‌పై మాట్లాడాడు టీమిండియా యువ క్రికెటర్ యువరాజ్ సింగ్. భారత్-పాక్ మ్యాచ్‌లు క్రికెట్‌కు మేలుచేస్తాయని యువీ అభిప్రాయపడ్డాడు.
"పాకిస్థాన్‌తో 2004, 2006, 2008లో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం నాకిప్పటికీ గుర్తుంది. ప్రస్తుతం రెండు జట్ల మధ్య సిరీస్ అన్నదే లేదు. ఆటపై ప్రేమతో మేం ఆడతాం. ఎవరితో ఆడాలో ఎంచుకునే అవకాశం మాకు లేదు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎంత ఎక్కువ జరిగితే.. క్రికెట్‌కు అంత మంచిది"
- యువరాజ్, టీమిండియా మాజీ ఆటగాడు