ఇటీవల రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న భారత దిగ్గజ క్రికెటర్ సచిన్‌కు కరోనా సోకిన తర్వాత ఇప్పుడు మరో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అతడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పిన యూసఫ్.. స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపాడు.
సచిన్ తర్వాత యూసఫ్ పఠాన్‌కు కరోనా - యూసఫ్ పఠాన్‌కు కరోనా
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపిన అతడు.. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు చెప్పాడు.

యూసఫ్ పఠాన్
ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని పఠాన్ సూచించాడు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశాడు. రోడ్ సేఫ్టీ సిరీస్ ఫైనల్లో శ్రీలంక లెజండ్స్పై గెలిచిన ఇండియా లెజెండ్స్.. విజేతగా నిలిచింది.
ఇదీ చూడండి:దిగ్గజ క్రికెటర్ సచిన్‌కు కరోనా పాజిటివ్