పాకిస్థాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ ఒకసారి తన మెడపై కత్తి పెట్టాడని ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. బ్యాటింగ్ సూచనలిచ్చినందుకు అతనలా చేశాడని ఫ్లవర్ వెల్లడించాడు. ఆటగాళ్ల వ్యక్తిత్వాల గురించి ఓ షోలో మాట్లాడిన ఆయన పలు విషయాలను పంచుకున్నాడు.
'సలహా ఇస్తే మెడ మీద కత్తిపెట్టాడు'
పాకిస్థాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ ఒకసారి తన మెడపై కత్తిపెట్టాడని తెలిపాడు ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్. బ్యాటింగ్ సూచనలు ఇచ్చినందుకు అలా చేశాడని వెల్లడించాడు.
గ్రాంట్ ఫ్లవర్
"యూనిస్ ఖాన్‌కు కోచింగ్ ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. బ్రిస్బేన్ (2016)లో టెస్టు సందర్భంగా జరిగిన ఓ సంఘటన నాకు గుర్తుంది. అల్పాహార సమయంలో అతనికి బ్యాటింగ్ సలహా ఇవ్వాలని ప్రయత్నించా. కానీ అతను నా మాట వినలేదు. వెంటనే ఓ కత్తి తీసి నా మెడ మీద పెట్టాడు. పక్కనే మిక్కీ ఆర్థర్ ఉన్నా ఏం చేయలేకపోయాడు. ఆ సంఘటన నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కోచ్‌గా ప్రయాణం నరకంగా మారినప్పటికీ దాన్ని నేను ఆస్వాదించా" అని ఫ్లవర్ తెలిపాడు.