తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీతో అతడికి పోలికలు వద్దు' - కోహ్లీ అజమ్ సచిన్

యువ బ్యాట్స్​మన్​ బాబర్ అజమ్​ను ప్రశంసించిన పాక్ బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్.. మరో ఐదేళ్లలో అతడు దిగ్గజ ఆటగాడు అవుతాడని అన్నాడు.

'ఐదేళ్లలో అతడు కోహ్లీలా రికార్డులన్నీ అధిగమిస్తాడు'
పాక్ బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్

By

Published : Jun 11, 2020, 7:53 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీతో పాకిస్థాన్ యువ క్రికెటర్​ బాబర్ అజమ్​ను పోల్చొద్దని అన్నాడు యూనిస్ ఖాన్. ఇటీవలే పాక్​ జట్టుకు బ్యాటింగ్​ కోచ్​గా నియమితుడైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్​మన్​ అని, అయితే బాబర్ అతడిలా రికార్డులు సాధించేందుకు మరో ఐదేళ్లు సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు.

"నాకు ఈ పోలికలు నచ్చవు. ప్రస్తుతం కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్​మన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే బాబార్ అజమ్.. ఈ మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తున్నాడు. మరో ఐదేళ్ల విరాట్​ స్థాయికి చేరుకుంటాడు. అయితే ఈ క్రమంలో అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి. అప్పుడే మెరుగైన క్రికెటర్ అవుతాడు" -యూనిస్ ఖాన్, పాక్ బ్యాటింగ్ కోచ్

పాక్ టీ20 కెప్టెన్ బాబర్ అజమ్

నా రికార్డులను అధిగమిస్తే చూడాలని ఉంది

బాబర్ ఎన్నో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పిన యూనిస్.. త్వరలో అతడు దిగ్గజ క్రికెటర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. తన రికార్డులను అధిగమిస్తే చూడాలని ఉందని అన్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details