భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తన బౌలింగ్ శైలితో ఎంతోమంది అభిమానులను సంపాందించుకున్నాడు. అందరికంటే ఇతడు బౌలింగ్ కాస్త భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. వేగం, కచ్చితత్వంతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేసే ఈ బౌలింగ్ విధానంపై చిన్నారులూ మక్కువ పెంచుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌లో ఓ పిల్లాడు.. బుమ్రా శైలిని అనుసరిస్తూ కనిపించాడు.
ఈ వీడియోను న్యూజిలాండ్‌లోని ఒల్లి ప్రింగిల్ అనే కోచ్.. ట్విట్టర్లో పంచుకున్నాడు. కివీస్ మాజీ కోచ్ మైక్ హెసన్ దీనిని రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం నెటిజన్లు ఆ పిల్లాడిని చూసి అచ్చం బుమ్రా లాగే బౌలింగ్ చేస్తున్నాడంటూ మెచ్చుకుంటున్నారు.