తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​తో బ్యాట్​ అందుకొని​... డబుల్​ సెంచరీ బాదేశాడు - డబుల్​ సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్​

ముంబయికి చెందిన యువ క్రికెటర్​ యశస్వి జైస్వాల్​ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫ్రొఫెషనల్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ద్విశతకం చేసిన పిన్న వయసు క్రికెటర్​గా చరిత్ర సృష్టించాడు.

సచిన్​ నుంచి బ్యాట్​ అందుకొని​... డబుల్​ సెంచరీ బాదేశాడు

By

Published : Oct 16, 2019, 7:10 PM IST

Updated : Oct 17, 2019, 7:12 AM IST

విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబయికి చెందిన యశస్వి జైస్వాల్​ రికార్డు డబుల్​ సెంచరీ చేశాడు. ఫ్రొఫెషనల్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతి తక్కువ వయసులోనే ద్విశతకం సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన వారిలో కౌశల్​(ఉత్తరాఖండ్​), సంజు శాంసన్​(కేరళ) తర్వాత మూడో వాడిగా నిలిచాడు.

ఈ డబుల్​ సెంచరీతో.. 44 ఏళ్లుగా సఫారీ జట్టు ఆటగాడి పేరిట ఉన్న మరో రికార్డును బ్రేక్​ చేశాడుయశస్వి. 17 ఏళ్ల 292 రోజుల వయసులోనే ఈ ఘనత అందుకున్నాడు. 1975లో అలెన్​ బారో(దక్షిణాఫ్రికా) 20 ఏళ్ల 273 రోజుల వయసులో చేసిన ద్విశతకమే ఇప్పటివరకు రికార్డు.

యువ క్రికెటర్​ యశస్వి జైస్వాల్​

బుధవారం ఝార్ఖండ్​తో జరగిన లిస్ట్​-ఏ మ్యాచ్​లో డబుల్​ సెంచరీ బాదేశాడు ఈ క్రికెటర్. 154 బంతుల్లో 203 పరుగులు చేశాడీ ఆటగాడు. ఇందులో 12 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. ప్రత్యర్థి జట్టులోని వరుణ్​ అరోన్​, షాబాజ్​ నదీమ్​ బౌలింగ్​ను ధాటిగానే ఎదుర్కొన్నాడు. ఈ యువ ఆటగాడి బ్యాటింగ్​తో 358 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబయి. గత మ్యాచ్​ల్లోనూ కేరళ, గోవా జట్లపై వరుసగా శతకాలు(113, 122) సాధించాడీ క్రికెటర్​. లిస్ట్​-ఏ మ్యాచ్​ల్లో బరిలోకి దిగిన యశస్వి... తొమ్మిదో మ్యాచ్​లోనే ఈ డబుల్​ ఫీట్​ అందుకున్నాడు.

సచిన్​ సంతకంతో బ్యాట్​...

గతేడాది అండర్​-19 జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు ఈ యువ ఆటగాడికి, తన సంతకం చేసిన బ్యాట్​ ఇచ్చాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందూల్కర్​​. శ్రీలంకతో జరిగిన ఓ సిరీస్​లోనూ మాస్టర్​ తనయుడు అర్జున్​ తెందూల్కర్​తో కలిసి యశస్వి ఆడాడు.

సచిన్​ సంతకం చేసిన బ్యాట్​తో యశస్వి

సంజూకు చేరువలో..!

భారత యువ క్రికెటర్​ సంజు శాంసన్‌... ఇటీవలే విజయ్​ హజారే టోర్నీలో వేగవంతమైన ద్విశతకం బాదిన వికెట్​ కీపర్​గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 129 బంతుల్లోనే 212* పరుగులు చేసిన ఈ ఆటగాడు... 10 సిక్సర్లు, 20 ఫోర్లతో చెలరేగి అజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలోనే అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్​గా ఘనత సాధించాడు. ఇతడి తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు యశస్వి.

Last Updated : Oct 17, 2019, 7:12 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details