తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మహేంద్ర సింగ్ ధోనీ 'క్రికెట్ ఛాంపియన్''

భారత మాజీ కెప్టెన్ ధోనీ గురించి మాట్లాడిన ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీ.. అతడికి క్రికెట్ ఛాంపియన్​గా అభివర్ణించాడు. రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలో మహీకి తెలుసని అన్నాడు.

You should never write off champions: Hussey on Dhoni's future
ధోనీ భవితవ్యంపై హస్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Jul 3, 2020, 7:47 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి​ ధోనీ.. 'క్రికెట్​ ఛాంపియన్​' అని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్​మన్​ మైకేల్​ హస్సీ అన్నాడు. లాక్​డౌన్​ విరామంతో అతడికి ఆత్మపరిశీలన చేసుకొనే అవకాశం దొరికిందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే మహీ.. భారత్​ తరఫున తిరిగి ఆడతాడా? లేదా? అనే విషయం గురించి వేచి చూడాలని తెలిపాడు.

ధోనీ

"నేను టీమ్​ఇండియా సెలెక్టర్​ను కాను. అయితే, మీరు ధోనీని అంత సునాయాసంగా తీసిపారేస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఛాంపియన్ల గురించి తక్కువ అంచనా వేయకూడదు. ధోనీ ఓ ఆటగాడిగా, సారథిగా దేశానికి ఎంతో సేవచేశాడు. తనను తాను ఆరోగ్యంగా ఉంచుకున్నంత కాలం అతడికి అడ్డు లేదు. లాక్​డౌన్​ మహీకి శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతడికి చాలా అనుభవం ఉంది. ధోనీ నైపుణ్యాలను అవసరమైన స్థాయికి మెరుగుపరుచుకునేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఆట గురించి గొప్ప అవగాహన ఉన్న వ్యక్తికి నైపుణ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు"

మైకేల్​ హస్సీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

ధోనీ మళ్లీ క్రికెట్​లో అడుగుపెట్టే విషయంపై మట్లాడుతూ.. "దేశం కోసం తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ధోనీ సిద్ధంగా ఉన్నాడా, లేడా? అనేది అతనికి చెందిన విషయం. ఇప్పటికీ ధోనీ మంచి ప్రదర్శన ఇస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు" అని వెల్లడించాడు.

ధోనీ, మైకేల్​ హస్సీ

గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​ చేతిలో భారత్ ఓడిన తర్వాత.. ధోనీ క్రికెట్​కు తాత్కాలిక విరామం ప్రకటించాడు.​ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 ప్రపంచకప్​తో ధోనీ తిరిగి మైదానంలో అడుగు పెడతాడా లేదా అనే విషయంపై క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. మరోవైపు ఐపీఎల్​లో చెన్నైసూపర్​ కింగ్స్​కు సారథిగా వ్యవహరించాల్సి ఉండగా.. లాక్​డౌన్​ కారణంగా లీగ్​ నిరవధిక వాయిగా పడింది.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ తర్వాత ఆలియా పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details