తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బుడగలో మానసికంగా దృఢంగా ఉండాలి' - శిఖర్​ ధావన్​

ఐపీఎల్​ బయో బుడగలో ఉన్నప్పుడు ఆటగాళ్లంతా మానసికంగా బలంగా ఉండాలని దిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్​ శిఖర్​ ధావన్​ తెలిపాడు. ఆ సమయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

Shikhar Dhawan
శిఖర్​ ధావన్​

By

Published : Sep 6, 2020, 7:24 PM IST

మరో 13 రోజుల్లో ఐపీఎల్​ సందడి ప్రారంభం కానుంది. క్రికెటర్లంతా తొలిసారి బయోసెక్యూర్​ వాతావరణంలో మ్యాచ్​లు ఆడనున్నారు. ఈ క్రమంలోనే బయో బబుల్​లో ఉన్నప్పుడు ఆటగాళ్లంతా మానసికంగా దృఢంగా ఉండాలని దిల్లీ క్యాపిటల్స్​ బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​ అభిప్రాయపడ్డాడు. బబుల్ ఛాలెంజ్​ను స్వీకరించడం ఏమంత కష్టం కాదని చెప్పాడు.

"బుడగలో ఉన్నప్పుడు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాలి. కొత్త వ్యక్తులను కలవలేరు. మా బృందానికైతే వినోద గది ఏర్పాటు చేసుకున్నాం. ఫ్రాంచైజీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటోంది. మేమంతా ఒక కుటుంబంలా కలిసిపోయాం. పరిస్థితిని ఏ విధంగా చూస్తామనే దానిపైనే మన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది."

శిఖర్​ ధావన్​, క్రికెటర్​

జట్టు సభ్యులతో కలవడానికి తనకు ఇదొక మంచి అవకాశమని శిఖర్​ పేర్కొన్నాడు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్​.. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది. అనంతరం సెప్టెంబరు 19న లీగ్​ జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. యూఏఈ వేదికగా నవంబరు 10 వరకు టోర్నీ నిర్వహించనున్నారు. కాగా ఆదివారం ఐపీఎల్​ షెడ్యూల్​ ప్రకటించింది పాలకమండలి. తొలి మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ జట్ల మధ్య జరగనుంది.

ఐపీఎల్​ షెడ్యూల్​
ఐపీఎల్​ షెడ్యూల్​

ABOUT THE AUTHOR

...view details