న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ బౌలింగ్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన వారిని తక్కువగా అంచనా వేయలేమని అన్నాడు.
"భారత బౌలింగ్ విభాగంపై నాకు పూర్తి నమ్మకముంది. కొంత విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాంత్.. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బ్రూమా, షమి బాగా ఆడారు. ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన భారత్‌ను తక్కువ అంచనా వేయలేం. వారిది వరల్డ్ క్లాస్ బౌలింగ్"